![]() |
![]() |

కార్తికేయ 2(Karthikeya 2)తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చందు మొండేటి(Chandoo Mondeti)లేటెస్ట్ గా యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga chaitanya),సాయి పల్లవి(Sai Pallavi)కాంబినేషన్ లో వచ్చిన 'తండేల్'(thandel)తో మరోసారి భారీ హిట్ ని అందుకొని క్రేజీ దర్శకుడుగా మారాడు.దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది.
ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో చందు మొండేటి మాట్లాడుతు 'తండేల్' తర్వాత తాను చెయ్యబోయే ప్రాజెక్ట్స్ లో సూర్య(Suriya)తో కూడా ఒక మూవీ ఉందని చెప్పిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజాగా సూర్య తో చెయ్యబోయే మూవీ భారీ బడ్జెట్ తో 'లార్జర్ ధేన్ లైఫ్' సినిమాగా అంటే జీవితం కంటే పెద్ద సినిమాగా ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ దగ్గర సూర్య డేట్స్ ఉన్నాయి కాబట్టి చందు మొండేటి,సూర్య, అల్లు అరవింద్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కబోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది.మరి ఈ కాంబో 'చందు మొండేటి' తదుపరి సినిమాగా ఉంటుందా లేక తర్వాత ఉంటుందా అనేది చూడాలి.
సూర్య అయితే ప్రస్తుతం 'కార్తీక్ సుబ్బరాజ్'(Karthik Subbaraj)దర్శకత్వంలో 'రెట్రో'(Retro)అనే మూవీతో పాటు 'ఆర్ జె బాలాజీ'(Rj Balaji)దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.ఈ రెండు చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
.webp)
![]() |
![]() |