![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కన్నడ కుట్టి రష్మిక నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్తూరు నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణ కథాంశంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడు. హీరో మాత్రమే కాదు హీరోయిన్ రష్మిక కూడా పుష్ప కోసం చిత్తూరు యాస నేర్చుకుంటోంది. అదే మాటను ఆమెను అడిగితే... 'నిజమే కానీ నీకు ఎలా తెలిసింది?' అంటూ అమాయకంగా ప్రశ్నించింది. పెద్ద సినిమా సంగతులు దాస్తే దాగుతాయా? ఏంది?
లాక్ డౌన్ వల్ల కర్ణాటకలోని సొంతూరికి రష్మిక వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇంట్లో తినడం, పుస్తకాలు చదవడం, నిద్రపోవడం తప్ప ఏమీ చేయట్లేదని ఆమె చెబుతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత స్నేహితులు అందరిని కలవాలని ఉందని చెబుతోంది. అయితే అభిమానుల్ని ఆందోళన చెందవద్దని ఓ ఆ భయం కూడా ఇచ్చింది. స్నేహితులతో కలిసినా ఆరు అడుగుల దూరం పాటిస్తాననీ, మాస్కులు వేసుకుని వెళ్తాననీ రష్మిక స్పష్టం చేసింది.
![]() |
![]() |