![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'చంటబ్బాయ్' చాలామందికి ఫేవరెట్ సినిమా. అందులో ప్రైవేట్ డిటెక్టివ్ గా మెగాస్టార్ నటన ప్రేక్షకులను మెప్పించింది. థియేటర్ల నిండా నవ్వులు పూయించింది. 'చంటబ్బాయ్' తర్వాత డిటెక్టివ్ నేపథ్యంలో వచ్చిన సినిమా, విజయం సాధించిన సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. దీంతో స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. దర్శకుడిగా మొదటి సినిమాకి తెలుగులో ఎవరూ ఎక్కువగా టచ్ చేయని బ్యాక్‌డ్రాప్ ఎంపిక చేసుకున్న స్వరూప్, రెండో సినిమాకి సైతం తెలుగులో ఎవరూ టచ్ చేయని బ్యాక్‌డ్రాప్ ఎంపిక చేసుకున్నాడు. 'డిజాస్టర్ డ్రామా' బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడిగా తన రెండో సినిమా తీయనున్నాడు స్వరూప్.
సునామి, భారీ తుఫాను, వరదలు, అగ్ని పర్వతాలు విస్పోటం కావడం వంటి పెను విపత్తులు (డిజాస్టర్స్) మీద హాలీవుడ్ లో సినిమాలు వస్తాయి. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు. అందుకని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని స్వరూప్ డిజాస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రిప్ట్ రాస్తున్నట్టు ఉన్నాడు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' కంటే ముందే ఈ కథ రాయడం స్టార్ట్ చేశాడట. ఆ సినిమా విడుదలైన తర్వాత స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే కంప్లీట్ చేశారట. లాక్ డౌన్ ఎత్తేశాక హీరోలను కలిసి కథ చెప్పాలని అనుకుంటున్నాడట.
![]() |
![]() |