![]() |
![]() |

అభిప్రాయ భేదాలతో 'జబర్దస్త్' షో నుంచి బయటకు వచ్చేసిన నాగబాబు, దానికి పోటీగా జీ తెలుగు చానల్లో 'అదిరింది' షో మొదలు పెట్టారు. దాంతో సహజంగానే రెండు షోల మధ్య పోలిక అనివార్యమవుతోంది. 'అదిరింది' షో మొదలై నాలుగు నెలలే అయినా వీక్షకుల నుంచి మంచి ఆదరణే పొందుతున్నట్లు సమాచారం. మరి నాగబాబు ఏం ఫీలవుతున్నారు? తన షో కాబట్టి గొప్పగా ఉందని చెప్తారని ఎవరైనా ఊహిస్తారు. అయితే ఆయన 'జబర్దస్త్'ను తక్కువ చేయకపోవడం గమనార్హం. రెండు షోల మధ్య పోలికల గురించి మాట్లాడిన నాగబాబు.. 'జబర్దస్త్'తో సరిసమానంగా 'అదిరింది' షో ఉందని అభిప్రయాపడ్డారు.
"జబర్దస్త్‌లో ఇప్పటికే చాలామంది సీనియర్లు ఉన్నారు. 'అదిరింది'లో కూడా చంద్ర, ఆర్పీ లాంటి సీనియర్లు ఉన్నారు. అదివరకు 'జబర్దస్త్'లో చేసి బయటకు వెళ్లపోయిన ధన్‌రాజ్, వేణు రావడం, కొత్తగా గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అనే రెండు టీమ్‌లు రావడం వల్ల 'అదిరింది' కూడా 'జబర్దస్త్'తో సరిసమానమైన కేపబిలిటీ సంతరించుకుంది. రెండు షోలలోనూ సీనియర్లు ఉన్నారు. అక్కడ అందరిలోకీ జూనియర్‌గా వచ్చిన ఆది ఎలా తారాజువ్వలాగా ఎగసి ఎలా మంచి పేరు సంపాదించుకున్నాడో, 'అదిరింది'లో కూడా రౌడీ బాయ్స్ టీమ్‌లోని సద్దామ్, భాస్కర్ కూడా స్టార్డమ్ తెచ్చుకునేలాగా ఎదుగుతున్నారు. నాకైతే 'అదిరింది' ఫ్రెష్‌గానూ, రెగ్యులర్ కామెడీకి భిన్నంగానూ ఉన్నట్లు అనిపిస్తోంది. 'అదిరింది' షో విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలా అని 'జబర్దస్త్'ను తక్కువగా చూడను. వాళ్లకు ఉండాల్సిన విలువ వాళ్లకు ఉంది, 'అదిరింది' విలువ 'అదిరింది'కి ఉంది. ఇది పెద్ద రేంజికి వెళ్తుంది. దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి" అని నాగబాబు చెప్పుకొచ్చారు.
![]() |
![]() |