![]() |
![]() |

ఎన్నిసార్లు..ఎన్ని కేసుల్లో బుక్కయినా సినీనటుల డ్రగ్స్ వాడకంలో మార్పు రావడం లేదు. గతంలో ఎందరో హీరోలు డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడి తమ జీవితాలు నాశనం చేసుకుని ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. వాటి నుంచి ఏ మాత్రం గుణపాఠాలు నేర్వని కొందరు వారి బాటలోనే నడుస్తున్నారు. తాజాగా నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ వ్యవహారంలో వారి దగ్గర నుంచి డ్రగ్స్ కొంటూ సినీ నటుడు అభిషేక్ కుమార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకి చిక్కాడు. ఇతను గతంలోనూ ఇదే తరహా కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. ఐతే, డేంజర్, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా తదితర సినిమాల్లో అభిషేక్ నటించాడు.
.jpg)
![]() |
![]() |