![]() |
![]() |

సినీ తారలంటే ఎప్పుడూ సినిమా షూటింగ్‌లతోనో..ఖాళీ దొరికితే షోరూం ఓపెనింగ్‌లతోనో బీజీగా ఉంటారు. కానీ ఇది ఒకప్పటి మాట..ఇప్పుడు అందరిలో సామాజిక బాధ్యత పెరిగినట్లే..సినిమా వాళ్లకి కూడా పెరిగింది. మొక్కల పెంపకం, రక్తదానం, బాలికా విద్య, గృహహింస, స్వచ్ఛభారత్ అంటూ మన తారా లోకమంతా ప్రజా సేవకోసం నడుం బిగించారు. అలాగే అప్పట్లో కాస్త వెనకడుగు వేసే అవయవదానం పట్ల కూడా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఎంతో మంది కృషి ఫలితంగా అర్గాన్ డొనేషన్‌కి ముందుకొస్తున్నారు. తాజాగా లెజండరీ డైరెక్టర్ మణిరత్నం, ఆయన సతీమణి నటి సుహాసిని అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. సాగా స్వచ్చంద సేవా సంస్థ చెన్నైలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో మణిరత్నం దంపతులు పాల్గొని తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వీరితో పాటు చారుహాసన్ దంపతులు కూడా తమ అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు.
![]() |
![]() |