![]() |
![]() |

ఏంటేంటి..సల్మాన్ కొడుకు వయసుకొచ్చాడా..ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా..? బాలీవుడ్‌లో ముదురు బ్యాచిలర్‌గా..ఇప్పటికీ ప్రేమాయణాలు నడిపిస్తున్న సల్మాన్‌కు పెళ్లెప్పుడైంది..కొడుకు ఎప్పుడు పుట్టాడు అనేగా మీ డౌట్. ఇక్కడ ఫోటోలో సల్మాన్‌తో కనిపిస్తున్న అబ్బాయి పేరు అలీ హాజీ. 2007లో కండలవీరుడు నటించిన పార్ట్‌నర్ సినిమాలో సల్లూభాయ్, లారా దత్తాల కొడుగ్గా నటించాడు. అప్పుడు చిన్నారిగా ఉన్న అలీకి ఇప్పుడు 17 ఏళ్లు. రీసెంట్‌గా బిగ్‌బాస్ సీజన్-10 సెట్‌లో తన రీల్ లైఫ్ తండ్రిని కలిసిన అలీ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అలీ ఈ ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలీ ఫనా సినిమాలో అమీర్‌ఖాన్‌కి, తారా రమ్‌పమ్ సినిమాలో సైఫ్ అలీఖాన్‌కి కుమారుడిగా నటించాడు.
![]() |
![]() |