![]() |
![]() |

ఎంతో కష్టపడి సినిమా తీయగానే సరిపోదు..ఆ సినిమా జనాల నోళ్లలో బాగా నానాలి.. అలా నానిన సినిమాకే జనం బ్రహ్మారథం పడతారు. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్న సినీజనాలు కాదేదు పబ్లిసిటీకనర్హం అన్నంత రేంజ్‌లో దూసుకుపోతున్నారు. చిన్న బెడ్జెట్‌లో సినిమాలు తీస్తూ వాటిని ఇంకా పబ్లిసిటీ చేస్తుంటాడు క్రియేటివ్ దర్శకుడు రవిబాబు. ఆయన తాజాగా పందిపిల్లను లీడ్‌రోల్‌లో పెట్టి "అదిగో" అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆల్‌మోస్ట్ ఆ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కొచ్చింది.
దీనిని పబ్లిసిటీ చేయడానికి విభిన్నంగా ఆలోచించాడు రవిబాబు. పెద్ద నోట్ల రద్దుతో జనం తిండి, తిప్పలు మానుకుని ఏటీఎంలు, బ్యాంకుల ముందు పడిగాపులు పడి మరీ కొత్త నోట్లు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భాన్ని తన పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు రవిబాబు. ఆలోచన వచ్చిందే తడవుగా తన పందిపిల్లను వెంటబెట్టుకుని వెళ్లి ఏటీఎం క్యూలైన్లో నిల్చున్నాడు. రవిబాబు లాంటి సెలబ్రిటీ సాధారణ వ్యక్తిలాగా క్యూలో నిల్చొవడమే ఆశ్చర్యమనుకుంటే..చంకలో పందిపిల్ల ఏంటి అని ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు నగదు విత్ డ్రా చేసుకోవడంతో పాటు పనిలో పనిగా తన మూవీ పబ్లిసిటీ కూడా అయిపోతుంది.
![]() |
![]() |