![]() |
![]() |

బుల్లితెరపై చెలరేగిపోయిన రష్మి... వెండి తెరపైనా విశ్వరూపం చూపిస్తోంది. గుంటూరు టాకీస్‌లో గుంటూరు మిర్చి కంటే హాటుగా తన గ్లామర్ ఘాటు ప్రదర్శించింది. రష్మి కథానాయికగా నటించిన అంతం సినిమాకీ ఆ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే తప్పకుండా అది రష్మికున్న గ్లామర్ ఇమేజే కారణం. అందుకే.. మున్ముందూ అందాల ప్రదర్శనకు అడ్డు చెప్పను అంటోంది రష్మి. మరీ ఇంత మితిమీరిన గ్లామర్ అవసరమా?? అని అడిగితే అంత ఘాటుగా సమాధానం ఇస్తోంది. ప్రస్థానం లాంటి సినిమాలో పద్ధతైన పాత్రలో కనిపించా, అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి సినిమాలు ఎన్ని చేసినా వర్కవుట్ అవ్వలేదు.. జబర్ దస్త్‌లో కాస్త గ్లామర్ గా కనిపించే సరికి... అందరూ ఆ షో గురించి మాట్లాడుకొన్నారు.. గ్లామర్ కున్న బలం అలాంటిది అంటోంది తెలివిగా. తనకు గ్లామర్ ఉంది కాబట్టి, చూపిస్తున్నానని, గ్లామర్ ఇమేజ్ కోసం చాలామంది ప్రయత్నించి విపలం అవుతున్నారని, తాను ప్రయత్నించకుండానే తనకు అలాంటి ఇమేజ్ వచ్చేసిందని సంబర పడుతోంది. ముసలమ్మలు అయిపోయాక గ్లామర్ పాత్రలు చేయం కదా?? అంటూ తెలివిగా ప్రశ్నిస్తోంది రష్మి. సో.. ఇక ముందూ రష్మి గ్లామర్ పాత్రల్లో మరింత రెచ్చిపోవడం ఖాయమన్నమాట. రష్మి ఫ్యాన్స్‌కి ఇంతకంటే జబర్‌దస్త్ న్యూస్ ఏముంటుంది???
![]() |
![]() |