![]() |
![]() |

పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ ఆపరేషన్ నిర్వహించి 40 మంది ముష్కరులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది . ఇదంతా ఉరీలో వీరమరణం పొందిన 18 మంది వీర జవాన్ల బలిదాన ఫలితంగానే. వారిని పొట్టనబెట్టుకున్న ఒక్కడిని కూడా వదలకూడదని..పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పాలని దేశ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన కారణంగానే. అలాంటి వీర జవాన్లపై అవమానకర వ్యాఖ్యలు చేశాడు ఒక సినీనటుడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురీ. భారత్‌లో పాక్ నటులపై నిషేధం విధించిన అంశంపై ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఓంపురీ మాట్లాడుతూ సైనికులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఎవరు వారిని ఆర్మీలో చేరమన్నారు..? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమని అన్నారు..? జవాన్లను ఆర్మీలో చేరమని మేమేమన్నా చెప్పామా..? ఇజ్రాయిల్ , పాలస్తీనా మాదిరిగా భారత్-పాకిస్థాన్‌లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారాలనుకుంటున్నారా..? అంటూ వ్యాఖ్యానించాడు. ఎంతోమంది భారతీయుల కుటుంబసభ్యులు పాకిస్థాన్‌లో కూడా ఉన్నారు. సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్దం చేసుకుంటాయి..? పాకిస్థాన్ నటులంతా ప్రభుత్వం ఇచ్చిన వీసాలతో పని చేస్తున్నారని వారిని నిషేధించడం సరికాదని అన్నారు. పాక్ నటులపై నిషేధం విధించాలంటే ముందుగా భారత ప్రభుత్వం వారి వీసాలు రద్దు చేయాలని సూచించాడు. ఈ వ్యాఖ్యలపై ఓంపురీని ఒక ఆట ఆడాకుంటున్నారు నెటిజన్లు..నటుడిగా కంటే కూడా సగటు భారతీయుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి..దేశాన్ని కాపాడే జవాన్లపై ఇదేనా నువ్వు చూపించే గౌరవం అంటూ ఏకీపారేస్తున్నారు.
![]() |
![]() |