![]() |
![]() |
.jpg)
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రాణస్నేహితులు ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ జంట ఒకటి. ఎన్నో వేదికల మీద వీరి స్నేహం యొక్క గొప్పదనం అందరికి తెలిసింది. స్నేహం గొప్పదనం స్నేహితుడి కోసం ఏమైనా చేసినప్పుడే బయటపడుతుందంటారు. తాజాగా అలాంటి పనే ఒకటి చేశాడు త్రివిక్రమ్. ప్రస్తుతం తన బెస్ట్ ఫ్రెండ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. అయితే పవన్ కాటమరాయుడు సినిమాతో అంతకంటే బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా కంప్లీటై త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు సుమారు మూడు నెలల సమయం పడుతుందని అంచనా. ఈ సమయంలో ఒక సినిమా చేసిపెట్టాలని త్రివిక్రమ్‌కు ఓ భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు గానూ ఈ మాటల మాంత్రికుడికి దాదాపు 10 కోట్లు ముట్టచెబుతాం అన్నారట, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని వదులుకున్నాడట. తన కాన్సన్‌ట్రేషన్ మొత్తం పవన్ మూవీపై మాత్రమే ఉందని..ఈ మధ్యలో మరో సినిమా చేసే ఆలోచన లేదని సదరు నిర్మాతకు తేల్చిచెప్పాడట. దీన్ని బట్టి వీరి స్నేహం ఎంత గొప్పదో కదా..కీపిటప్ త్రివిక్రమ్.
![]() |
![]() |