Home

»

Latest News

ఆఫర్ ఇస్తే అందుకు ఓకే..!

Oct 3, 2016 5:44PM

ఐటెం సాంగ్..ఒకప్పడు ఈ తరహా సాంగ్స్ చేయడానికి ప్రత్యేక భామలు ఉండేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ సాంగ్స్‌ని హీరోయిన్లే చేసేస్తున్నారు. అందుకు బోలెడు కారణాలున్నాయి. హీరోయిన్‌గా ఛాన్సులు రాకపోవడం, కొంచెం కష్టపడితే కోట్లు రావడంతో నాయికల చూపు స్పెషల్ సాంగ్స్‌ వైపు పడుతోంది. మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే తమన్నా..ఈ తరహా ట్రెండ్‌ సెట్ చేసింది..ఆమె బాటలో రీసెంట్‌గా కాజల్ కూడా నడిచి డబ్బుకు డబ్బు, క్రేజ్‌కు క్రేజుకు సంపాదించుకుంది. తాజాగా వీరి లిస్ట్‌లోకి చేరింది ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా.. టాలీవుడ్ , కోలీవుడ్‌లలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న రాశి..తాజాగా ఐటెం సాంగ్స్‌లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి స్పెషల్ సాంగ్స్‌లో నటించడం అంటే కాస్త ఇబ్బందే. అక్కడ అంత సౌకర్యం ఉండదు. అయితే, ఎవరైనా ఆఫర్ చేస్తే మాత్రం అలాంటి పాటలు చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చింది. సో గేట్ రెడీ ప్రోడ్యూసర్స్ అండ్ డైరెక్టర్..
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com