![]() |
![]() |

'కేజీఎఫ్' వంటి భారీ గ్లోబల్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నుండి నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ డ్రామా 'టాక్సిక్'. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. మొదటిరోజే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు స్థాయి బోణీ కొట్టింది. అయితే, ప్రీమియర్ షో ముగిసిన తర్వాత థియేటర్ల నుంచి వచ్చిన టాక్, ట్విటర్ (X) రివ్యూలు మాత్రం షాక్ ఇస్తున్నాయి. 'A' సర్టిఫికేట్‌తో 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన ఈ సినిమాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ "మూడు గంటల టార్చర్" అని కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కేవలం విజువల్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ పైనే శ్రద్ధ పెట్టారని.. అసలైన కథాకథనాలను పూర్తిగా గాలికొదిలేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటించినప్పటికీ, ఏ ఒక్క పాత్రకు కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. సాంకేతికంగా రిచ్‌గా కనిపిస్తున్నప్పటికీ, గందరగోళంగా ఉన్న స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ లోపాలు, వీక్ డైలాగ్స్ వల్ల సినిమా పేలవంగా మారిందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. దానికితోడు రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల లౌడ్‌గా ఉంటూ ఇబ్బందికరంగా అనిపించిందని నెటిజన్లు తమ రివ్యూలలో రాసుకొచ్చారు.
కేజీఎఫ్ తరహా మాస్ ఎలివేషన్ల శైలిని ఫాలో అవ్వబోయి అసలుకే ఎసరు తెచ్చారని, ఏమాత్రం బలమైన కాన్ఫ్లిక్ట్ లేకుండా కేవలం రక్తపాతం, అనవసరమైన బోల్డ్ సీన్స్ పైనే ఆధారపడ్డారని విమర్శకులు మండిపడుతున్నారు. మహిళా పాత్రల ఓవర్‌లోడ్‌తో పాటు ఉద్దేశం లేని యాక్షన్ సీన్లు, బలవంతంగా ఇరికించిన బోల్డ్ సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయని, తెలుగు డబ్బింగ్ కూడా చాలా చోట్ల అసహజంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ 3 గంటల వయలెంట్ డ్రామాలో యశ్ తన శక్తినంతా ధారపోసి నటనతో మెప్పించడం ఒక్కటే ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. యశ్ స్టైలిష్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించాయట. యశ్ తన వంతుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ, సరైన స్క్రిప్ట్ లేకపోవడం వల్ల గీతూ మోహన్‌దాస్ తన వద్ద ఉన్న భారీ క్యాన్వాస్‌ను పూర్తిగా వృథా చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాకింగ్ స్టార్ అభిమానులకు ఈ 'టాక్సిక్' తీవ్ర నిరాశను మిగిల్చిందని ట్విట్టర్ టాక్ ని బట్టి తెలుస్తోంది. మరి జనరల్ షోల తర్వాత టాక్ ఏమైనా మారుతుందో లేక ఇదే కంటిన్యూ అవుతుందో చూడాలి.
Toxic Review, Yash, Geetu Mohandas
![]() |
![]() |