Home  »  News  »  పాలమ్మిన పూలమ్మిన అంటారు.. ఇదేనా మీరు చేసే పని.?

Updated : Aug 25, 2026

చిన్న సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ 'కికు చిరంజీవి' హీరో కికు యనమల ఆవేదన వ్యక్తం చేశారు. "పాలమ్మిన పూలమ్మిన" అంటూ వేదికలపై మాట్లాడే పెద్ద మనుషులు.. కష్టపడి సినిమా తీసిన చిన్న హీరోలను చిన్నచూపు చూస్తున్నారు అంటూ.. పరోక్షంగా తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక వేడుకలో "పాలమ్మిన పూలమ్మిన" అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో మూవీ ఈవెంట్స్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి. ఇటీవల 'టాక్సిక్' ఈవెంట్ కూడా వేలాది మంది సమక్షంలో జరిగింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం పర్మిషన్ ఇవ్వడంలేదట. 'కికు చిరంజీవి' మూవీ విషయంలో మొదట ఈవెంట్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, ఆ తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారట. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో కికు యనమల బయటపెట్టారు.

హీరో కికు యనమల మాట్లాడుతూ.. "ఒక ప్రముఖ కాలేజీలో ప్రమోషన్స్ చేసుకుంటామని పర్మిషన్ అడిగితే మొదట ఇస్తామని చెప్పి, తీరా సమయానికి కనీసం రెస్పాండ్ కాలేదు. కానీ, అదే పెద్దాయన ఒక పెద్ద సినిమా వేడుకలో స్టేజ్ మీద నిలబడి 'నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా.. ఎంతో కష్టపడ్డాను' అని చెప్తే చాలా బాధగా అనిపించింది. మీరు కష్టపడినప్పుడు ఎదుటివారి కష్టాన్ని కూడా గుర్తించాలి కదా" అని ఎమోషనల్ అయ్యారు. "ఒక పెద్ద సినిమా కోసం ఏకంగా 75,000 మందిని ఒకే చోట ఆర్గనైజ్ చేసిన సదరు వ్యక్తులు.. కనీసం నా సినిమా కోసం ఒక 700 మందిని కూడా ఆర్గనైజ్ చేసి హెల్ప్ చేయలేకపోయారా? మా కష్టం వాళ్లకు కనిపించలేదా?" అని ప్రశ్నించారు.

అంతేకాదు, థియేటర్ల వద్ద కూడా చిన్న సినిమాలకు ఘోరమైన అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కష్టపడి ప్రింట్ చేయించి వేసిన 'కికు చిరంజీవి' మూవీ పోస్టర్లను తొలగించేసి, వాటి ప్లేస్‌లో ఇతర భాషల పెద్ద సినిమాలైన 'టాక్సిక్' వంటి పోస్టర్లను పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. "మన తెలుగు సినిమాలకు మనవాళ్లే సపోర్ట్ చేయకపోతే ఇక బయటవాళ్లు ఎలా చేస్తారు? పోనీ ఆ 'టాక్సిక్' పోస్టర్ పక్కనైనా మా సినిమా పోస్టర్ ఉంచవచ్చు కదా? అలా కాకుండా పూర్తిగా తీసి పడేయడం ఎంతవరకు న్యాయం?" అని ఆయన నిలదీశారు.

 

 

 

Kiku Chiranjeevi, Kiku Yanamala, Toxic Movie, Mallareddy

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.