Home

»

Latest News

దాగుడు మూతలు దండాకోర్: మాస్ మహారాజా సంక్రాంతి జాతర.!

Aug 25, 2026 7:37PM

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కాంబినేషన్‌లో #SVC64గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘దాగుడు మూతలు దండాకోర్’ అనే మైండ్ బ్లోయింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు.

అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా లాక్ చేశారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. 'ఇరుముడి' గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ఫుల్ జోష్‌తో ఉన్న రవితేజ, దిల్ రాజు నిర్మాణ విలువలు, హసిత్ గోలి మార్క్ అవుట్ అండ్ అవుట్ హార్డ్‌కోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్ రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, రవితేజ-శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ఓ మల్టీస్టారర్ నిర్మిస్తున్నట్లు వార్తలొచ్చాయి. 'వీరాధి వీరులు' అనే టైటిల్ కూడా ప్రచారం జరిగింది. మరి అదే మల్టీస్టారర్ కు ఈ ‘దాగుడు మూతలు దండాకోర్’ టైటిల్ ను ఫిక్స్ చేశారా? లేక ఇది వేరే సినిమానా? అనే క్లారిటీ రావాల్సి ఉంది.

 

 

 

Irumudi, Ravi Teja, Dagudu Moothalu Dandakor, Sankranthi 2027

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com