![]() |
![]() |

గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ఊహకి అందని కథ, కథనం, లొకేషన్స్, క్యారక్టర్ ల తీరుతోనే సెల్యులాయిడ్ పై వండర్ ని క్రియేట్ చేసే దర్శక రచయిత 'క్రిస్టోఫర్ నోలన్'(Christopher Nolan). ప్రెజెంట్ ది ఒడిస్సీ' తో వరల్డ్ వైడ్ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యంపై పైరసీ రాబందుల నీడ పడింది. దీంతో ప్రపంచ సినీ రంగంతో పాటు నోలన్ అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
స్పష్టమైన హై క్వాలిటీ ప్రింట్‌తో ఈ పూర్తి సినిమా ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో ప్రత్యక్షమైంది. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అందరినీ తీవ్రంగా కలవరపెడుతున్న ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ లీకైన సినిమా కాపీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు 21 లక్షల మంది (2.1 మిలియన్లు) వీక్షించారు. ఒక భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రం ఈ స్థాయిలో లీక్ కావడం మరియు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది మంది దానిని చూడటం కలకలం రేపుతోంది.
ఈ పైరసీ వ్యవహారంపై చిత్ర నిర్మాణ సంస్థ వెంటనే అప్రమత్తమై తీవ్రంగా స్పందించింది. కాపీరైట్ చట్టాల కింద న్యాయపరమైన చర్యలు వేగంగా ప్రారంభించి,సామాజిక మాధ్యమాల నుంచి పైరసీ వీడియో లింకులని, సినిమాని పోస్ట్ చేసిన సంబంధిత ఖాతాను వెంటనే తొలగించే పనులను వేగవంతం చేసింది. అయితే అప్పటికే కోట్లాది రూపాయల వ్యాపారం పైరసీ ముప్పు వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఏర్పడటంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రీకు మహాకవి హోమర్ రాసిన అత్యంత ప్రాచీన ఇతిహాసం ఆధారంగా మాట్ డామన్, అన్నీ హథవే, టామ్ హాలెండ్ ప్రధాన క్యారెక్టర్లలో నోలన్ తెరేక్కించాడు. సుమారు 2,000 కోట్లకి (250 మిలియన్ డాలర్లు) పైగా భారీ బడ్జెట్‌తో రూపొందింది. సినీ చరిత్రలోనే మొదటిసారిగా పూర్తి సినిమాను అత్యంత ఖరీదైన ఐమ్యాక్స్ 70ఎంఎం (IMAX 70mm) కెమెరాలతో చిత్రీకరించి ఒక సరికొత్త విజువల్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కథలోని సహజత్వం కోసం స్కాట్లాండ్, ఇటలీ, గ్రీస్, మొరాకో, ఐస్‌ల్యాండ్ వంటి 5 దేశాలలో 91 రోజుల పాటు అహోరాత్రులు షూటింగ్ నిర్వహించారు.
Also read: ప్రముఖ బిజినెస్ మెన్ ప్రేమలో మలైకా అరోరా!.. గబ్బర్ సింగ్ కెవ్వు కేక గుర్తిందిగా
తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లు (. 2,548 కోట్లు) వసూలు చేసి నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 700 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో దాదాపు 6,700 కోట్లు) మార్కుకి అత్యంత చేరువలో ఉంది. భారతీయ మార్కెట్‌లోను ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజే 20.76 కోట్ల గ్రాస్ సాధించడంతో పాటు మొదటి వారంలో 100 కోట్ల క్లబ్‌లో చేరి ప్రస్తుతం 147 కోట్ల భారీ వసూళ్లని సొంతం చేసుకుంది.
The Odyssey, Christopher Nolan, Hollywood
![]() |
![]() |