Home  »  News  »  ప్రముఖ బిజినెస్ మెన్ ప్రేమలో మలైకా అరోరా!.. గబ్బర్ సింగ్ కెవ్వు కేక గుర్తిందిగా

Updated : Jul 27, 2026

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హిట్ మూవీ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ తో తెలుగు ప్రేక్షకులని అలరించిన భామ 'మలైకా అరోరా'. కాలు కదిపితే బాక్స్ ఆఫీస్ బద్దలే అనే రీతిలో బాలీవుడ్ లో పలు స్పెషల్ సాంగ్స్ లో సత్తా చాటిన మలైకా నటిగాను ప్రూవ్ చేసుకుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ మాజీ భార్య కాగా  2017లో విడాకులు తీసుకొని  జాన్వీ కపూర్ సోదరుడు, తన కంటే 12 ఏళ్లు వయసులో చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆ బంధానికి కూడా సెండ్ హాఫ్  చెప్పింది. ఇప్పుడు ఆమె జీవితంలోకి మరో కొత్త వ్యక్తి వచ్చారనే న్యూస్ బాలీవుడ్‌లో నయా సంచలనం.

ప్రముఖ డైమండ్ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో మలైకా అరోరా డేటింగ్ లో ఉన్నట్టుగా టాక్ .ఇటీవల కాలంలో పలు ప్రముఖ ప్రాంతాల్లో వీరిద్దరూ ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలమైన ఊతమిచ్చినట్లయింది. తాజాగా ముంబైలోని  బాంద్రా ప్రాంతంలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో మలైకా అరోరా తన 21 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అదే పార్టీకిహర్ష్ మెహతా కూడా వచ్చాడు. మలైకా తన కొడుకు అర్హాన్‌తో కలిసి ఈ వేడుకకు రావడం, అదే సమయంలో హర్ష్ మెహతా కూడా అక్కడే ఉండటంతో వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఈ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ఒకేసారి కెమెరాల ముందుకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, ఒకే వేదికపై, ఒకే ప్రైవేట్ ఈవెంట్‌లో కనిపించడం వల్ల బాలీవుడ్ వర్గాల్లో ఇది అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మలైకా అరోరా మరియు హర్ష్ మెహతా తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని  ప్రస్తుతం పూర్తిగా గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారట. ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, తమ బంధాన్ని చాలా ప్రైవేట్‌గా నడిపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముంబై నగరంలో పాపరాజీల నిఘా కెమెరాల నుంచి తప్పించుకోవడం ఏ సెలబ్రిటీకీ అంత సులభమైన విషయం కాదు. దీంతో వీరికి సంబంధించిన చిన్న చిన్న పిక్స్, వీడియో క్లిప్పింగ్స్ బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా అవుతున్నాయి.


Also read: చెన్నైలవ్ స్టోరీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ కొట్టినట్లేనా..శ్రీ గౌరీ ప్రియ ఎవరు!

ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా మలైకా అరోరా, డైమండ్ బిజినెస్‌మెన్ హర్ష్ మెహతాలు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నప్పటికీ, ఈ విషయంపై ఇటు మలైకా కానీ, అటు హర్ష్ మెహతా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మలైకా వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. 

Malaika Arora,  Harsh Mehta, Bollywood

 

 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.