![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన నటనా జీవితానికి ముగింపుగా నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్' (తెలుగులో 'జన నాయకుడు'). కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే. నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్ ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల ప్రభంజనంతో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది.
విడుదలైన మొదటి రోజు నుంచే దళపతి విజయ్ మాస్ స్టామిటాను నిరూపిస్తూ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజే ఇండియాలో నెట్ రూపంలో 42.70 కోట్ల భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ లో 48.27 కోట్లు, ఓవర్సీస్‌లో 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో కలిపి మొదటి రోజే రూ. 80.28 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ మైలురాయిని అధిగమించింది.
రెండవ రోజున వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లలో కొంత మందగమనం కనిపించి భారతదేశంలో రూ. 21.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కానీ, వీకెండ్ ప్రారంభమవ్వడంతో శనివారం మూడో రోజున మళ్లీ పుంజుకుని రూ. 28.50 కోట్ల నెట్ రాబట్టి దూకుడు ప్రదర్శించింది. ఇక నాలుగో రోజు ఆదివారం బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తూ ఏకంగా రూ. 32 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.
దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే ఇండియాలో 'జన నాయగన్' చిత్రం రూ. 124.75 కోట్ల నెట్ సాధించి 100 కోట్ల క్లబ్‌లో ఘనంగా అడుగుపెట్టింది. ఇండియా గ్రాస్ పరంగా రూ.145.98 కోట్లు, ఓవర్సీస్ లో రూ.71.50 కోట్ల వసూళ్లతో కలిపి గ్లోబల్ వైడ్‌గా రూ.217.48 కోట్ల గ్రాస్ సాధించి దండయాత్ర కొనసాగిస్తోంది.
ఈ అద్భుతమైన ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌తో ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ వీక్ సాధించిన టాప్ చిత్రంగా 'జన నాయగన్' నిలిచింది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా ఇదే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Jana Nayagan, Box Office, Thalapathy Vijay
![]() |
![]() |