Home  »  News  »  సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!

Updated : Jul 17, 2026

మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న ప్రమాదకరమైన కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రేయాస్ తల్పాడే కలిసి ఒక సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది ఇండియా స్టోరీ' ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి ఇంటర్నెట్‌లో #WhatsOnYourPlate అనే వినూత్నమైన డిజిటల్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు.

ఈ సరికొత్త ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన రోజువారీ భోజనం ప్లేట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మనం నిత్యం తీసుకునే ఆహారంలో పురుగుమందుల కల్తీ ఎంతవరకు ఉందనే కోణంలో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించేలా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ చైతన్య ఉద్యమం కేవలం తనతోనే ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమె టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లను ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తూ నామినేట్ చేశారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చే సమంత, రకుల్ లను నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పటికే ఈ ఛాలెంజ్ పై రకుల్ స్పందించారు. తాను క్లీన్ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నట్లు తాను తింటున్న ప్లేట్ ఫోటోలు షేర్ చేశారు. అలాగే, ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తూ తన భర్త జాకీ భగ్నానీతో పాటు, హీరోయిన్ తమన్నాను నామినేట్ చేయడం విశేషం. 

మరోవైపు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే కూడా ఈ వినూత్న క్యాంపెయిన్‌లో చురుగ్గా భాగమయ్యారు. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారంపై మరింత అవగాహన పెంచుకోవాలని, ఈ ఆరోగ్యకరమైన సవాల్‌ను స్వీకరించి తమ భోజనం ఫోటోలను ఆయా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం థియేటర్లలో సినిమా చూపించి వదిలేయడం కాకుండా, దేశంలోని ప్రతి ఇంటా ఒక బాధ్యతాయుతమైన, ఆరోగ్యకరమైన చర్చ జరగాలనే ఉన్నతమైన లక్ష్యంతోనే తాము ఈ వినూత్న డిజిటల్ క్యాంపెయిన్‌ను డిజైన్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రస్తుతం మన వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, ప్రాణాంతక పురుగుమందుల వల్ల సామాన్య ప్రజల ఆరోగ్యం రోజురోజుకూ ఎలా ప్రమాదంలో పడుతోందనే సున్నితమైన, అత్యంత భయంకరమైన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో అత్యంత వాస్తవికంగా చూపించబోతున్నారు. సామాజిక బాధ్యతతో కూడిన ఈ క్రేజీ సోషియో-రియలిస్టిక్ డ్రామా మూవీ 'ది ఇండియా స్టోరీ' జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. 

 

 

Kajal Aggarwal, Samantha Ruth Prabhu, Rakul Preet Singh, The India Story, Tamannaah Bhatia

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.