![]() |
![]() |

గోదారి గట్టుపైన రామ చిలకనే.. గీ పెట్టి గింజకున్న నీకూ దొరకనే' అంటూ తెలుగు ప్రేక్షకులకి 2025 సంక్రాంతిని మర్చిపోని సంక్రాంతిగా చేసిన అచ్చ తెలుగు నటి ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh). రేపు తిరువీర్ తో కలిసి 'ఓ సుకుమారి' మూవీతో థియేటర్స్ లో మరో సారి తన సత్తా చాటడానికి వస్తుంది.
ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతు కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా, నటనకి స్కోప్ ఉన్న విభిన్నమైన కథలని ఎంచుకోవడం నాకు ముఖ్యం. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల్లో భిన్నమైన రోల్స్ పోషించినప్పటికీ, నాలో ఉన్న నటిని పూర్తిగా ఆవిష్కరించే మరిన్ని సవాలుతో కూడిన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ముఖ్యంగా ఫుల్ లెంగ్త్ సైకో క్యారెక్టర్లు లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న సైకోపాత్ క్యారెక్టర్స్ లలో చేయాలనేది నా చిరకాల కోరిక. కథ డిమాండ్ చేస్తే నటించి మెప్పించడానికి వంద శాతం సిద్ధంగా ఉన్నాను.ఓ సుకుమారిలో ఒంటిని తాకితే కరెంట్ షాక్ కొట్టే వింత లక్షణం ఉన్న అమ్మాయిగా చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పుకొచ్చింది.
Also read: భార్యకి విడాకులు ఇచ్చిన రామాయణ నటుడు.. ఆ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా!
ఓ సుకుమారిని భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మించాడు.
Aishwarya rajesh, Thiruveer, Oh Sukumari

![]() |
![]() |