Home  »  News  »  రామ్ చరణ్ తో నయనతార.. అసలు ఆట మొదలు కాబోతుందా!

Updated : Jul 16, 2026

 

హీరోలకే కాదు, హీరోయిన్ కి కూడా చాలా లాంగ్ కెరీర్ ఉంటుందని నిరూపించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో నయనతార(Nayanthara)ఒకరు. లేడీ సూపర్ స్టార్ అనే టాగ్ లైన్ తో  ఒక బ్రాండ్ గా  కూడా నిలిచింది.ఇక పెద్దితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని  స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ఈ క్రేజీ కాంబో మరోసారి చేతులు కలిపింది. 


ఈ చిత్రంలో నయనతార  హీరోయిన్‌గా కాకుండా అత్యంత కీలకమైన,కథని మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్ పోషించనుందని సమాచారం.సుకుమార్ తన సినిమాల్లో కేవలం హీరో పాత్రలకే కాకుండా, కథకి వెన్నుదన్నుగా నిలిచే బలమైన క్యారెక్టర్లని  డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు.అదే విధంగా  నయనతార కోసం ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్‌ క్రియేట్ చేశారట.ఆ రోల్ కి  నయనతార అయితేనే వంద శాతం న్యాయం చేయగలదని భావించిన సుకుమార్, ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ విన్న నయన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో టాక్ గట్టిగానే  వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, గతంలో చిరంజీవితో కలిసి 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్', మరియు రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్' చిత్రాల్లో అలరించిన నయనతార, ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ సినిమాలో సరికొత్త నటనతో మెప్పించబోతోంది.

Also read:  అక్కినేని అంటే ఆ అరగంట చెప్పేసిందా! లెనిన్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు 

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశకు చేరుకోగా, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.  ఈ ఏడాది అక్టోబర్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు 'పెద్ది'  450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.