Home  »  News  »  గ్లోబల్ టాప్ 10 లిస్టులో చరణ్ 'పెద్ది'.. క్రేజీ వ్యూస్‌తో సరికొత్త రికార్డు!

Updated : Jul 16, 2026

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' థియేటర్ల వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించి, ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ విధంగా 2026 సంవత్సరానికి గాను టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌లలో ఒకటిగా నిలిచింది. ఓ సామాన్య కార్మికుడు తన అసాధారణ క్రీడా నైపుణ్యంతో, తన సొంత గ్రామ హక్కుల కోసం సాగించిన భావోద్వేగ పోరాటం ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ఈ వెండితెర అద్భుతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయి సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 9 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'పెద్ది' చిత్రానికి డిజిటల్ ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. కేవలం థియేటర్లలోనే కాకుండా, ఓటీటీ స్క్రీన్లపై కూడా రామ్ చరణ్ తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ చిత్రం హోల్డ్‌ను చూపిస్తూ, భారతీయ ఓటీటీ స్ట్రీమింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోందని ప్రముఖ ఇండస్ట్రీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందాల నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రాంతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో ఏకంగా ఐదో స్థానాన్ని కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ వైడ్‌గా ఏకంగా 1.9 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం సౌత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే అసలైన ఊచకోత ముందుందని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ హిందీ వెర్షన్ జూలై 30న విడుదల కానుంది. దాంతో ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటంతో వ్యూస్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు ఈ నెట్‌ఫ్లిక్స్ రికార్డులే అసలైన నిదర్శనమని చెప్పవచ్చు.

 

 

Ram Charan, Peddi, Netflix OTT, Janhvi Kapoor 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.