![]() |
![]() |

రూపాయి.. ఒక్క రూపాయి. ఆ రూపాయికి చాక్ లెట్ కూడా రాని రోజుల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఒక బడా హీరో ఆ రూపాయినే తన రెమ్యునరేషన్ గా తీసుకొని సినిమా చేసాడు. సినిమా చేసాడు అంటే ఏదో సరదాగా గెస్ట్ గా అలా వచ్చి వెళ్ళుంటాడని, లేదా ఏ 40 , 50 వ దశకంలో వచ్చిన మూవీలో హీరో చేసుంటాడులే, వాళ్ళ చుట్టాలు చేసారని ఒక్క రూపాయికి చేశాడులే అనుకునేరు. అలాంటిదేం లేదు. పక్కాగా హీరోగా చేసాడు. పైగా ప్రెజెంట్ చేసిన సినిమానే.
'సత్లుజ్' ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైన కేవలం 48 గంటల్లోనే హఠాత్తుగా స్ట్రీమింగ్ నుండి తొలగించబడటంతో తీవ్ర వివాదం రాజుకుంది. సెన్సార్షిప్ వివాదాలు, రాజకీయ విమర్శల నడుమ ఈ చిత్రం వార్తల్లో నిలుస్తుండగా, ఈ మూవీ హీరో దిల్జీత్ దోసాంజ్(diljit dosanjh)నే సత్లుజ్ కోసం తన రెగ్యులర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా, కేవలం ఒకే ఒక్క రూపాయి మాత్రమే టోకెన్ అమౌంట్‌గా తీసుకున్నాడు. ఈ నిజాన్ని చిత్ర దర్శకుడు హనీ ట్రేహన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగపూరితమైన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రం పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 1984 నుండి 1994 మధ్య కాలంలో పంజాబ్‌లో సుమారు 25,000 మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను రహస్యంగా దహనం చేశారనే సంచలన నిజాన్ని బ్యాంక్ ఉద్యోగి జస్వంత్ సింగ్ ఖల్రా తన పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకొస్తాడు. ఆ తర్వాత 1995లో ఆయన్ని కొందరు అపహరించి, పోలీసు కస్టడీలోనే హత్య చేశారని కోర్టు రికార్డుల్లో ఉంది. ఈ చారిత్రాత్మకమైన రోల్ పోషించడానికి బాలీవుడ్ కమర్షియల్ హీరోల కంటే పంజాబ్ సంస్కృతి తెలిసిన ఒక సిఖ్ నటుడే కరెక్ట్ అని భావించిన దర్శకుడు హనీ ట్రేహన్, 2021లో దిల్జీత్ దోసాంజ్‌ను కలిసి కథ వివరించారు.
కేవలం 30 నిమిషాల పాటు సాగిన ఆ మొదటి సమావేశంలో, దర్శకుడు సేకరించిన రీసెర్చ్ పత్రాలని మరియు జస్వంత్ సింగ్ ఖల్రా అసలు ఫోటోని దిల్జీత్ చూశారు. ఆ ఫోటో చూడగానే ఆయన కళ్లు చెమర్చాయి, వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడి, స్క్రిప్ట్‌ను భక్తితో తన నుదుటికి హత్తుకుని 'వాహేగురు' అని స్మరించుకున్నారు. అంతటి మహోన్నతమైన త్యాగధనుడి పాత్రలో నటిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం తనకు అవమానకరమని, ఒక్క పైసా కూడా తీసుకోనని దిల్జీత్ తేల్చి చెప్పారు. అయితే లీగల్ కాంట్రాక్ట్ నిబంధనల కోసం కనీస మొత్తం తీసుకోవాలని దర్శకుడు పట్టుబట్టడంతో, కేవలం 1 మాత్రమే తీసుకునేందుకు ఆయన అంగీకరించారు.
Also read: ఆ విషయం మరిచారా పూరి గారు.. సినీ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్
సినిమా చిత్రీకరణ సమయంలో కూడా దిల్జీత్ ఎంతో ఓపికగా సహకరించారు. కొన్ని రోజులు ఉదయం 6 గంటలకే సెట్స్‌కు వచ్చినా, షెడ్యూల్స్ మారడం వల్ల సాయంత్రం 4 గంటల వరకు ఆయనపై మొదటి షాట్ కూడా తీయలేని పరిస్థితులు ఎదురయ్యాయి. దర్శకుడు క్షమాపణలు కోరిన ప్రతిసారీ, 'పాజీ.. పరవాలేదు, మీరు ఏం చేసినా సినిమా కోసమే చేస్తున్నారు, నా పూర్తి మద్దతు ఉంటుంది' అంటూ దిల్జీత్ ఎంతగానో ప్రోత్సహించారు. తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని, సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దిల్జీత్ మాట్లాడుతు జస్వంత్ సింగ్ ఖల్రా ఆ క్యారెక్టర్ నుండి బయటకు రావడానికి కనీసం ఒక వారం రోజులు పట్టిందని స్వయంగా పేర్కొన్నారు.
diljit dosanjh, satluj

![]() |
![]() |