Home  »  News  »  Nagarjuna: నిర్మాతగా నాగార్జున అందుకున్న హిట్, ప్లాప్స్ ఇవే! 

Updated : Jul 6, 2026

 

తెలుగు సినీ అగ్ర హీరోల్లో కింగ్  నాగార్జున(Nagarjuna)ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచే తెలుగు సినిమాకి పాన్ ఇండియా సొగసులు అద్దిన తొలి హీరో. తన తండ్రి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన 'అన్నపూర్ణ స్టూడియోస్' బ్యానర్‌ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తు నటుడిగానే కాకుండా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా తనదైన ముద్ర వేశారు. ప్రయోగాత్మక చిత్రాలని నిర్మించడంలో కూడా వెనకాడలేదు. నిర్మాతగా ఇప్పటివరకు దాదాపు 30కి పైగా సినిమాలని  నిర్మించగా, వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి, మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆడక డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ మనం స్టూడియోస్ పై కూడా  నాగార్జున సొంతంగా నిర్మించిన సినిమాల్లో దాదాపు 18కి పైగా విజయాలు సాధించగా, 10కి పైగా  పరాజయాన్ని చవిచూశాయి. 

నిర్మాతగా నాగార్జున కెరీర్‌ని  మలుపు తిప్పిన మైలురాయి చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని  సాధించడమే కాకుండా, ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకుంది. ఆ తర్వాత 2002లో వచ్చిన 'మన్మథుడు', 2004లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్' బాక్సాఫీస్‌ని  షేక్ చేసి నిర్మాతగా నాగార్జునకి  భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా నాగార్జున, నాగచైతన్య, ఏఎన్నార్ మూడు తరాల హీరోలతో కలిసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2014లో నిర్మించిన 'మనం' మూవీ  తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి అటు విమర్శకుల ప్రశంసలని, ఇటు కలెక్షన్లని కొల్లగొట్టింది. ఆ తర్వాత 2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం దాదాపు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నాగార్జున ప్రొడక్షన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది.


also read: Prabhas: ప్రభాస్ ఫౌజీపై నాగవంశీ కామెంట్స్ వైరల్ 

అయితే, నిర్మాతగా నాగార్జునకి  అన్ని రోజులు ఒకేలా సాగలేదు. ప్రయోగాల కోసం ఆయన పెట్టిన పెట్టుబడులు కొన్నిసార్లు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. 2013లో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'భాయ్'  అన్నపూర్ణ స్టూడియోస్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌. డిస్ట్రిబ్యూటర్లకి అయితే  దాదాపు 70 శాతం వరకు నష్టాలను మిగిల్చింది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మించిన 'మన్మథుడు 2' (2019)  కూడా ఫ్యాన్స్, ప్రేక్షకులని  ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. తన కుమారులు నాగచైతన్య, అఖిల్‌లను హీరోలుగా పెట్టి నిర్మించిన 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' చిత్రాలలో 'రారండోయ్' మంచి విజయం సాధించగా,  'హలో' మాత్రం యావరేజ్ టాక్‌తో కమర్షియల్‌గా నష్టాలని  తెచ్చింది. అయినప్పటికీ, 2022లో వచ్చిన 'బంగార్రాజు' సినిమాతో మళ్లీ నిర్మాతగా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇలా దాదాపు 60 శాతం సక్సెస్ రేటుతో టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్‌గా నాగార్జున ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. ఈ నెల 10 న మరో మారు తనయుడు అఖిల్ లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ కూడా వన్ ఆఫ్ ది పార్టనర్. 

  nagarjuna, akhil akkineni, lenin, bhagyashri borse

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.