Home  »  News  »  Chiranjeevi: మెగాస్టార్ కెరీర్‌లోనే విచిత్ర ప్రయోగం.. ఆ సూపర్ హిట్ మూవీలో చిరుకి పేరే లేదు

Updated : Jul 1, 2026

 

 

-హీరో క్యారక్టర్ కి పేరు ఉంటుంది కదా!
-మరి చిరంజీవి క్యారక్టర్ కి మూవీ మొత్తం పేరు ఉండదు 
-అది కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీలో 
 -ఆ మూవీ ఏంటో చూద్దాం


ఎనీ హీరోని తీసుకోండి.. హీరో క్యారక్టర్ కి పేరు లేకుండా మూవీ మొత్తం నడవడం అనేది జరగని పని.. కానీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నుంచి వచ్చిన ఒక మూవీలో చిరు క్యారక్టర్ కి పేరు లేదు. ఏంటి అబద్దమని అనుకుంటున్నారా! పేరు లేకుండానే సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.  


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఒక రికార్డుని క్రియేట్ చేసిన చిత్రం 'రాక్షసుడు'. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చౌదరి నవల ఆధారంగా  ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రం 1986 అక్టోబర్ 2వ తేదీన విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలోనే  చిరంజీవి పోషించిన క్యారక్టర్ కి పేరు అనేది  ఉండదు. కథ మొత్తం మిగిలిన క్యారెక్టర్స్ చిరుని  'మిత్రమా', పురుషా, జికే పెంపుడు కొడుకా, సోదర' అని మాత్రమే సంబోధిస్తాయి. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోగా  ప్రత్యేకంగా ఎలాంటి పేరు లేకుండా కేవలం ఒక సంకేత పదంతోనే క్యారక్టర్ ని నడిపించి మెప్పించడం టాలీవుడ్ చరిత్రలోనే  అరుదైన ప్రయోగం.

Also read: Skn: ఎస్ కె ఎన్ ఆసక్తికరవ్యాఖ్యలు.. అది మన క్రష్‌ అయితే, ఏ క్రష్ అయినా మనతో రావాల్సిందే


 చిరంజీవి సరసన రాధ, సుహాసిని హీరోయిన్లుగా నటించగా చిరు సోదరుడు నాగబాబు ఈ చిత్రంతోనే తన సినీరంగ ప్రవేశం చేశారు. మెగాస్టార్ పవర్‌ఫుల్ యాక్షన్, ఇళయరాజా అద్భుతమైన సంగీతం, వెటూరి సాహిత్యంలో వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', అచ్చా అచ్చా వచ్చా వచ్చా  'హే నాటీ' వంటి పాటలు మూవీ  విజయంలో కీలక రోల్ పోషించాయి. ఆ రోజుల్లోనే ఏకంగా 28 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఈ సినిమా సాధించిన ఘన విజయానికి గుర్తుగా అప్పట్లో చెన్నైలో నిర్వహించిన వంద రోజుల వేడుకకి  సూపర్ స్టార్ రజనీకాంత్, అతిలోక సుందరి శ్రీదేవి, దర్శకేంద్రుడు కె. విశ్వనాథ్ వంటి దిగ్గజాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వేడుకలో శ్రీదేవి స్వయంగా చిరంజీవికి మెమొంటోని  అందజేయడం విశేషం. ఈ చిత్రం తమిళంలోకి కూడా డబ్ అయి అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో ఎప్పుడు గుర్తుండిపోయే రాక్షసుడులో చిరంజీవి క్యారక్టర్ కి పేరు లేకపోవడం ఒక సంచలనమే అని చెప్పవచ్చు. యండమూరి నవలలో  కూడా హీరో క్యారక్టర్ కి పేరు ఉండదు. 

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.