Home  »  News  »  Bhagyaraj: భాగ్యరాజ్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ సంతాపం

Updated : Jun 27, 2026

 


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. అద్భుతమైన కథలు, విలక్షణమైన స్క్రీన్‌ప్లేతో కొన్ని దశాబ్దాల పాటు అభిమానులని,ప్రేక్షకులని  అలరించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ నిన్న అర్ధరాత్రి  కన్నుమూశారు. 73 సంవత్సరాల వయసులో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్తు భారతీయ చిత్ర సీమ దిగ్భ్రాంతికి లోనవుతు తన సానుభూతిని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

 సోషల్ మీడియా వేదికగా 'ఒక సాధారణ రచయితగా, సహాయ నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన భాగ్యరాజ్, ఆ తర్వాత తన అసాధారణ ప్రతిభతో దర్శకుడిగా, హీరోగా ఎదిగారు. కేవలం ఒకే రకమైన కథలకే పరిమితం కాకుండా, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, తిరుగులేని గుర్తింపుని సంపాదించుకున్నారు. ముఖ్యంగా సినిమా టైటిల్స్ విషయంలో సంప్రదాయాలను పక్కనబెట్టి, వినూత్నమైన ఆలోచనలతో సినిమాలు తీసి సక్సెస్ సాధించిన ఘనత భాగ్యరాజ్ గారి సొంతం.


Also read: మెగా 158 నిర్మాతకి విజయ్ బంపర్ ఆఫర్.. ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా నియామకం

భాగ్యరాజ్ అందించిన కథలు, స్క్రీన్‌ప్లే కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు. భాషా సరిహద్దులని దాటి విస్తరించాయి.  ఆయన సృష్టించిన అనేక అద్భుతమైన చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయి. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలు, ప్రేమ, సున్నితమైన కుటుంబ కథలను  వెండితెరపై మలిచిన తీరు అద్భుతం. ఇప్పటికీ ఎంతో మంది యువ దర్శకులకి  ఆయన ఒక రోల్ మోడల్ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.