Home  »  News  »  Nagabandham: 110 కోట్ల భారీ రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లోనే అసలు రహస్యం

Updated : Jun 27, 2026

 


తెలుగు సినిమా గొప్పతనాన్ని మరో సారి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై చాటి చెప్పబోతున్న చిత్రం 'నాగబంధం'(Nagabandham)ది సీక్రెట్ ట్రెజర్. మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే అన్ని థియేటర్స్ లో మారు మోగిపోతున్నాయి. దీంతో మూవీ లవర్స్ లో, ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో 'నాగబంధం'పై  భారీ అంచనాలు నెలకొన్నాయి. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం స్టార్ వ్యాల్యూ లేకపోయినప్పటికీ, కేవలం కథపై ఉన్న బలమైన నమ్మకంతో నిర్మాతలు ఏకంగా 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించడం ఒక పెద్ద సాహసం.  జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు నిశిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మరియు బడ్జెట్ పెరగడానికి గల కారణాలని  పంచుకున్నారు.

ఈ కథ మొత్తం కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గదులు, బ్రహ్మకమలం,  నాగబంధం అనే అలౌకిక రక్షణ శక్తి చుట్టూ తిరుగుతుంది. పురాతన రహస్యాలు, విధి రాత, దైవిక శక్తుల కలయికతో ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని  అందించడానికి దర్శకుడు అభిషేక్ నామా ఈ కథకి ట్రెజర్ హంట్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌  జోడించారు. విజువల్స్ అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ (VFX) కంపెనీలు ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబగళ్లు శ్రమించాయి. సినిమాటిక్ వండర్‌గా మార్చే క్రమంలోనే తొలుత అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు 5 రెట్లు బడ్జెట్ పెరిగి, చివరకి  110 కోట్ల రూపాయల మార్కుని  అందుకుంది.

సినిమాలో లార్జర్ ద్యాన్ లైఫ్ అనుభూతిని తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నానక్‌రామ్‌గూడలో భారీ సెట్లు వేశారు. అందులో ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించిన దశావతార విగ్రహాలని ఒక వృత్తాకారంలో అమర్చి, దాదాపు 4.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఒక అద్భుతమైన సెట్‌ను నిర్మించారు.విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో అవుట్‌పుట్ తీసుకురావడం వల్లే ఈ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చింది. మాకు దైవ భక్తి ఎక్కువ. ప్రతి రోజు శివుని అభిషేకంతో రోజుని స్టార్ట్ చేస్తాం.ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి మూవీనే ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం చూస్తుంటే మా వెనుక శివుడు, అనంత పద్మనాభ స్వామి ఉన్నాడని నమ్ముతాం. కార్తీక పౌర్ణమి రోజున ఇరవై నాలుగు గంటల పాటు అభిషేకం జరుగుతుండగా మా మూవీ లాస్ట్ షెడ్యూల్ పూర్తయిందని చెప్పుకొచ్చారు.

Also read: Bhagyaraj: భాగ్యరాజ్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ సంతాపం

 నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నగార్కర్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కేవలం భక్తిరస చిత్రంగానే కాకుండా, పాతాళ భైరవి లాంటి క్లాసిక్ సినిమాల తరహాలో అడ్వెంచర్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం నమ్ముతోంది. 110 కోట్ల భారీ బడ్జెట్ రిస్క్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, జూలై 3న ఈ నాగబంధం విజువల్ మాయాజాలం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.