Home  »  News  »  మెగా 158 నిర్మాతకి విజయ్ బంపర్ ఆఫర్.. ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా నియామకం

Updated : Jun 27, 2026


ఇళయ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్(VIjay)ఒక  అనూహ్య నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. దిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అత్యంత కీలకమైన 'తమిళనాడు ప్రత్యేక ప్రతినిధి'  పదవిలో 'జననాయగన్' సినిమా నిర్మాత కె. వెంకట నారాయణకి  ఈ కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసాడు.


క్యాబినెట్ మంత్రి హోదాతో కూడిన ఈ నియామకం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కె. వెంకట నారాయణ బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రముఖ 'కేవీఎన్ గ్రూప్' (KVN Group) చైర్మన్. రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో భారీ వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓగా పనిచేసిన ఆయన, 2020లో కేవీఎన్ ప్రొడక్షన్స్ స్థాపించి ఇప్పటివరకు ఇరవై ఐదుకి పైగా సినిమాలకి  డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి 158 చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'జననాయగన్'  సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ సమస్యల వల్ల ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే. 

Also read: బాక్సాఫీస్ వద్ద బుడ్డోడు కలెక్షన్ల సునామీ.. చిదంబరం హ్యాట్రిక్ హిట్


గత మే నెలలో విజయ్ గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు హక్కులు క్లెయిమ్ చేసినప్పుడు కూడా వెంకట నారాయణ ఆయనతో పక్కనే నడుస్తూ కనిపించారు. సీఎం విజయ్ తనకు అత్యంత ఆప్తుడైన వ్యక్తికి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న 'కృతజ్ఞత' రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.