![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి ఎంటైర్ తన కెరీర్ లోనే సూపర్ హిట్ అందించి మరో మారు తన మార్క్ ని చాటి చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో తన హవాని కంటిన్యూ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు. VenkyAnil5 NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్‌తో పిలుస్తున్న ఈ మూవీ రెండు రోజుల క్రితం స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మేకర్స్ ప్రమోషనల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. "కత్తి లాంటి ఐడియా" అంటూ సాగే ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతూ, కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని చెప్పేందుకు కూడా అనిల్ ఓ వెరైటీ వీడియోతో మన ముందుకు వచ్చాడు. హీరో, హీరోయిన్లు, జివి ప్రకాశ్ మాట్లాడుతూ ఉండగా చేతిలో పెద్ద కత్తి పట్టుకొని. తల పాగ పెట్టుకొని అనిల్ అక్కడకు వస్తాడు. తనకు ‘కాన్సెప్ట్ కింగ్’ అనే బిరుదు ఇచ్చారని చెబుతాడు. ఇంతలో వెంకటేశ్ నేను ఓ ఐడియా ఇస్తానని కత్తి తీసుకొని అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తారు. అనంతరం వీర తిలకం అమ్మాయిలు దిద్దాలిగా అంటూ హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టిలు అనిల్ వేలిని కట్ చేసి వీర తిలకం పెడతారు. ఆ తర్వాత అనిల్ ‘ఎంత రాయలసీయ బ్యాక్‌డ్రాప్ అయితే మాత్రం ఇంత రక్తపాతం అవసరమా’ అని చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. చివర్లో సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించడంతో పాటు 2027 సంక్రాంతికి థియేటర్స్ లో కలుద్దామని టీం చెప్పింది.
also read: Samantha: సమంత అసలు రూపం బయటపెట్టిన ఆడపడుచు.. తెల్లవారుజామున 3 గంటలకి ఏం చేసిందంటే
![]() |
![]() |