Home  »  News  »  Prakash Raj: ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. సినీ వర్గాల్లో సంచలనం

Updated : Jun 21, 2026

 

ఎనీ క్యారక్టర్ తీసుకోండి సదరు క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి చెడుగుడు ఆడుకునే  లెజండ్రీ యాక్టర్ ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ నుంచి వచ్చిన గత చిత్రాలని ఓజి, డెకాయిట్ లే ఒక ఉదాహరణ. అలాంటి  ప్రకాష్ రాజ్‌చట్టపరమైన నిబంధనలని ఉల్లంఘించాడనే ఆరోపణలతో  బెంగళూరు కోర్టు  నాన్-   బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ పరిణామం ఒక్కసారిగా సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు ప్రకాష్ రాజ్ లాంటి ఒక సీనియర్ నటుడిపై బెయిల్ రాని విధంగా అరెస్ట్ వారెంట్ రావడానికి గల కారణాలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ వివాదం అంతా ఓటర్ ఐడీ కార్డుల చుట్టూ తిరుగుతోంది. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని బెంగళూరుకు చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఒక భారతీయ పౌరుడిగా కేవలం ఒకే చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. కానీ, ప్రకాష్ రాజ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు సహా 4 వేర్వేరు ప్రాంతాలలో ఓటర్ గుర్తింపు కార్డులు పొందారనేది ప్రధాన ఆరోపణ. దీనిని తీవ్రమైన ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ బెంగళూరులోని 48వ ACJM కోర్టు (అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు) ఈ కేసును విచారణని   స్వీకరించింది.


Also read: ఫ్యామిలీ ఆఫర్ ప్రకటించిన సింగ్ గీతం టీం.. టికెట్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా!

చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా కోర్టు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ, బిజీ షెడ్యూల్స్ వల్లో లేదా ఇతర కారణాల వల్లో ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలని  ఉల్లంఘించడంతో, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు  వారెంట్లు జారీ అయ్యాయి. అయినా కూడా నటుడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, న్యాయస్థానం ఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించింది. తాజాగా మూడోసారి కూడా ఆయనపై కఠినమైన నాన్  బెయిల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తూ, తదుపరి విచారణకు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.