Home  »  News  »  Samantha: సమంత అసలు రూపం బయటపెట్టిన ఆడపడుచు.. తెల్లవారుజామున 3 గంటలకి ఏం చేసిందంటే

Updated : Jun 21, 2026

 

సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం తో థియేటర్స్ లో సందడి చేశున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ టైంలో సమంత భర్త రాజ్ నిడిమోరు సోదరి 'శీతల్' సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన  భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

ఆమె తన పోస్ట్ లో నేను ఇంతవరకు సమంత నటించిన ఏ ఒక్క సినిమాని  కూడా చూడలేదు. కానీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సమంత అసలు రూపం ఎలాంటిదో తాను స్వయంగా చూశాను. పెళ్లయిన కొన్ని రోజులకే హైదరాబాద్‌లోని సమంత ఇంట్లో నేను బస చేశాను. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేసింది. శరీరం విపరీతంగా వణికిపోవడం, వాంతులు అవ్వడం, తల పగిలిపోయేలా నొస్తూ ఉండటంతో, కనీసం మంచం దిగి మందులు లేదా దుప్పట్లు వెతుక్కునే ఓపిక కూడా లేకపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడానికి మొదట కాస్త సంకోచించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో తప్పక సాయం కావాలని సందేశం పంపింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా సమంతే మొదటి వ్యక్తిగా స్పందించింది. ఇంట్లో మరెవరినీ నిద్ర లేపకుండా, కనీసం తన సోదరుడు రాజ్‌కు కూడా చెప్పకుండా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా సమంతే స్వయంగా శీతల్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది.

ఆ సమయంలో ఇంట్లో అదనపు దుప్పట్లు దొరకకపోవడంతో, సమంత ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెద్దపెద్ద టవళ్లను తీసుకువచ్చి శీతల్‌కు చలి పెట్టకుండా చుట్టింది. అవసరమైన మందులు, తాగునీరు అందించి దగ్గరుండి సపర్యలు చేసింది. శీతల్‌ను మరింతగా కదిలించిన విషయం ఏమిటంటే, ఆ రాత్రంతా సమంత అస్సలు నిద్రపోలేదు. పెళ్లి హడావుడి ఇప్పుడిప్పుడే ముగియడం, చుట్టూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ, కేవలం కొన్ని గంటల్లోనే సమంత ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయినప్పటికీ, తన ఆరోగ్యం కంటే అత్తగారింటి ఆడపడుచు ఆరోగ్యమే ముఖ్యమని భావించి సామ్ రాత్రంతా మేల్కొనే ఉంది. మరుసటి రోజు ఉదయం శీతల్ కోలుకుని షూటింగ్ సెట్‌కు వెళ్లి చూసేసరికి, సమంత చీరకట్టులో ఎంతో అలవోకగా సొంతంగా స్టంట్స్ చేస్తూ కనిపించింది. రాత్రంతా నిద్రలేదనే అలసట ఎక్కడా మొహంపై కనిపించకుండా, కెమెరా ముందుకు రాగానే ఎంతో ఏకాగ్రతతో, చిరునవ్వుతో నటిస్తున్న సమంతని చూసి శీతల్ ఆశ్చర్యపోయాను.

Also read:  Allu arjun: నా దేవుడు ఆయనే.. అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియో వైరల్

షూటింగ్ విరామంలో సమంత శీతల్‌ను చూడగానే, సినిమా గురించి కాకుండా 'ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?' అని ఎంతో ఆరాటంగా అడిగింది. ఒక మనిషి అలసిపోయినప్పుడు కూడా ఇతరులపై చూపే ఈ కరుణే ఆమె అసలైన శక్తని శీతల్ కొనియాడారు. వెండితెరపై 'మా ఇంటి బంగారం' సినిమా చూడటానికి ముందే, తాను నిజమైన 'బంగారం' లాంటి మనసున్న సమంతను కలిశానని శీతల్ ఎమోషనల్ అయ్యారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.