![]() |
![]() |

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) లీడ్ రోల్‌లో నటిస్తూ, స్వయంగా నిర్మించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా 'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ ఈవెంట్‌లో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు (Suresh Babu) ఈ వేడుకకు అతిథిగా విచ్చేశారు. ఆయన వస్తున్న సమయంలో సమంత స్వయంగా ఎదురెళ్లి, ఎంతో వినయపూర్వకంగా నమస్కరించి ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. సామ్ చూపించిన ఈ పద్ధతి, పెద్దలపై ఆమెకు ఉన్న గౌరవం చూసి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.
సమంత కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన 'ఓ బేబీ' చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధంతోనే సమంత అడగగానే ఆయన ఈ ఈవెంట్‌కు విచ్చేశారు. స్టేజ్ పై సురేష్ బాబు మాట్లాడుతూ.. సమంత, నందినీ రెడ్డిల కాంబినేషన్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో వీరిద్దరూ కలిసి 'ఓ బేబీ' లాంటి అద్భుతమైన విజయాన్ని అందించారని, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' చిత్రంతో అంతకంటే పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
సురేష్ బాబు మాట్లాడుతున్నంత సేపు సమంత ఎంతో హుందాగా ఆయన మాటలను వింటూ, గౌరవపూర్వకంగా రియాక్ట్ అవ్వడం వేదికపై హైలైట్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఈ హార్ట్ వార్మింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా వైరల్ అవుతోంది. సమంత సంస్కారాన్ని నెటిజన్లు, అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.
![]() |
![]() |