Home  »  News  »  పాప్ సింగర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిన మాజీ ప్రధాని.. వీడియోస్ వైరల్ 

Updated : Jun 16, 2026


పాప్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న అంతర్జాతీయ సింగర్ కేటీ పెర్రీ(katy perry)కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Justin Trudeau)ల మధ్య నడుస్తున్న ప్రేమాయణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి రిలేషన్‌షిప్‌  వార్తలు సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తున్నాయి. అసలు  41 ఏళ్ల కేటీ పెర్రీ, 54 ఏళ్ల జస్టిన్ ట్రూడో తమ బంధాన్ని ఎక్కడా దాచుకోకుండా బహిరంగంగానే కెమెరాల ముందుకు రావడం గ్లోబల్ మీడియాలో  సైతం సెన్సేషన్ సృష్టిస్తోంది. 

ఇటీవల జరిగిన ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేటీ పెర్రీ కాన్సెర్ట్ ఫిల్మ్ ‘ది లైఫ్‌టైమ్స్ టూర్ - లైవ్ ఫ్రమ్ పారిస్’ ప్రీమియర్ షో జరిగింది. ఈ రెడ్ కార్పెట్ వేడుకకి ట్రూడోతో కలిసి హాజరైన కేటీ పెర్రీ, అందరి ముందే మాట్లాడుతు  జస్టిన్ ట్రూడో తన ‘లైఫ్ పార్ట్నర్’  జస్టిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. నా జీవితానికి అతడే ఒక బలమైన పునాది అని బాహాటంగానే ప్రకటించింది.

ఈ గ్లోబల్ లవ్ స్టోరీ ఇక్కడితోనే ఆగలేదు, ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభోత్సవ వేడుకల్లో ఈ జంట మరింతగా రెచ్చిపోయింది. లాస్ ఏంజిల్స్‌లోని సోఫి స్టేడియంలో 70,000 మందికి పైగా ఉన్న ప్రేక్షకుల సమక్షంలో కేటీ పెర్రీ తన అద్భుతమైన ప్రదర్శనతో స్టేజ్ మొత్తాన్ని షేక్ చేసింది. సిల్వర్ కలర్ స్టెల్లా మెక్‌కార్ట్నీ గౌనులో మెరిసిపోతూ 10 ఏళ్ల నార్వేజియన్ సింగర్ తియాస్ లుకాతో కలిసి ‘వండర్’ అనే సాంగ్‌ లైవ్‌లో పాడి అందరినీ మంత్రముగ్ధులని చేసింది. ప్రదర్శన అయిపోయిన తర్వాత  స్టేజ్ పైనుంచి కిందకు దిగిన కేటీ పెర్రీ, చెప్పులు కూడా లేకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి నేరుగా విఐపి బాక్స్‌లో ఉన్న తన ప్రియుడు జస్టిన్ ట్రూడోని గట్టిగా హగ్ చేసుకుని, ముద్దులతో ముంచెత్తింది. ఈ పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ అఫెక్షన్ (PDA) వీడియోలు క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ని షేక్ చేశాయి.

అయితే ఈ లవ్ ట్రాక్ కెనడాలో పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా అదే రోజు కెనడా జట్టు బోస్నియా, హెర్జెగోవినాతో తలపడింది. కానీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తన సొంత దేశం మ్యాచ్‌ వదిలేసి, అమెరికా వర్సెస్ పరాగ్వే మ్యాచ్‌కి  హాజరై కేటీ పెర్రీకి సపోర్ట్ చేయడంపై కెనడియన్ ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జస్టిన్ ట్రూడో ఎక్స్  వేదికగా చాలా సరదాగా స్పందించారు. "కొన్నిసార్లు లాయల్ బాయ్‌ఫ్రెండ్ బాధ్యతలు (Boyfriend Duties) పిలుస్తాయి, అందుకే వెళ్లాల్సి వచ్చింది. కానీ వరల్డ్ కప్ ఎవరు గెలవాలో నా మనసులో ఏముందో మీకు తెలుసుగా" అంటూ కెనడా జెండా ఎమోజీని షేర్ చేస్తూ కూల్‌గా ఆన్సర్ ఇచ్చారు.


Also read: Ram Pothineni: రామ్ పోతినేనికి బడ్జెట్ షాక్.. ఆ హీరోయిన్ అవుట్!


హాలీవుడ్ నటుడు ఓర్లాండో బ్లూమ్‌తో తొమ్మిదేళ్ల బంధానికి స్వస్తి పలికిన కేటీ పెర్రీ, 2025 జూలైలో మాంట్రియల్‌లో జరిగిన కాన్సెర్ట్ సమయంలో జస్టిన్ ట్రూడోతో తొలిసారిగా సన్నిహితంగా కనిపించింది. అప్పటి నుండి కోచెల్లా 2026 మ్యూజిక్ ఫెస్టివల్‌లో జస్టిన్ బీబర్ కాన్సెర్ట్‌ను కలిసి వీక్షించడం వరకు వీరిద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పుడు కెనడాను శాసించిన ప్రధాన మంత్రి, ఇప్పుడు పాప్ క్వీన్ ప్రేమలో పడి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారడం నిజంగానే ఒక క్రేజీ అప్‌డేట్.

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.