Home  »  News  »  Ram Pothineni: రామ్ పోతినేనికి బడ్జెట్ షాక్.. ఆ హీరోయిన్ అవుట్!

Updated : Jun 16, 2026

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ (RAPO 23) ద్వారా హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. హీరోగా కేవలం రెమ్యుנరేషన్ తీసుకుని నటించడం వేరు, ఒక సినిమాని  సొంతంగా నిర్మిస్తూ పర్యవేక్షించడం వేరు అనే విషయాన్ని రామ్ ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నారు. ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్థితుల్లో బడ్జెట్ పరిమితులకు లోబడి, ఖర్చులను పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రామ్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం సినిమా లాభాల్లో వాటా (ప్రాఫిట్ షేర్) మాత్రమే తీసుకునేలా నిర్ణయించుకోవడం విశేషం. అయితే రామ్ బడ్జెట్ అదుపు చేయాలని చూస్తున్నా, సినిమాకు కావలసిన నటీనటుల రెమ్యునరేషన్ల రూపంలో ఊహించని భారీ షాక్ తగిలింది.

ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ మరియు విలక్షణమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు ఎస్. జె. సూర్యని సంప్రదించింది. కానీ ఆయన డిమాండ్ చేసిన  8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ విని మేకర్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో  ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయిస్తే సినిమా బడ్జెట్ పరిమితి దాటిపోతుందని రామ్ భావించారు. దీనితో పాటు హీరోయిన్ ఎంపిక విషయంలో రామ్‌కి  మరో బడ్జెట్ షాక్ తగిలింది. ‘కేజీఎఫ్’ఫేమ్ శ్రీనిధి శెట్టిని కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం.

Also read: Gv Prakash kumar: రాజకీయాల్లోకి సంగీత దర్శకుడు జి వి ప్రకాశ్ కుమార్.. ఆ పార్టీలోకి అంటూ సంచలన వ్యాఖ్యలు

ఇలా నటీనటుల రెమ్యునరేషన్ల కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం కంటే, ఇతర  ప్రత్యామ్నాయ ఆప్షన్లని వెతకడమే ఉత్తమమని  రామ్ కఠినమైన నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే భారీగా రెమ్యునరేషన్లు డిమాండ్ చేసిన వారిని పక్కన పెట్టి, ప్రణాళికకు తగ్గట్టుగా కొత్త కాస్టింగ్‌ పరిశీలిస్తున్నారు. శ్రీనిధి శెట్టి స్థానంలో  కయదు లోహార్ పేరును పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆమెతో ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ డేట్స్ సమస్యల కారణంగా కయదు లోహార్ కుదరకపోతే సంయుక్త మీనన్‌ని  తదుపరి ఆప్షన్‌గా లైన్‌లో పెట్టినట్లు సమాచారం. నటుడిగా ఉన్నప్పుడు బడ్జెట్ విషయాలను పెద్దగా పట్టించుకోని రామ్, ఇప్పుడు తానే స్వయంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా మారడంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్టార్ కాస్టింగ్, బడ్జెట్ వివరాలపై  అధికారిక క్లారిటీ రానుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.