Home  »  News  »  Valathu Vashathe Kallan Review : వలతు వశతే కన్నన్ మూవీ రివ్యూ

Updated : May 7, 2026

మూవీ : వలతు వశతే కన్నన్ 
నటీనటులు: జోజూ జార్జ్, బిజూ మీనన్, లీనా, లియోనా లిశోయ్, వైష్ణవి రాజ్, నిరంజన అనూప్, షజూ శ్రీధర్ తదితరులు
ఎడిటింగ్: వినాయక్
సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్
మ్యూజిక్: విష్ణు శ్యామ్
నిర్మాతలు: షాజీ నదేసన్
దర్శకత్వం: జీతు జోసెఫ్
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో


కథ :
కేరళలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐగా 'ఆంటోని' (బిజూ మీనన్) పనిచేస్తుంటాడు. అక్కడ ఉండే మురళి అనే రాజకీయనాయకుడు చెప్పినట్టుగా ఆంటోని నడుచుకుంటాడు. అందువలన మురళి కొడుకు 'రాజీవ్' చేసే తప్పులను కవర్ చేస్తుంటాడు ఆంటోని. అలాంటి వాటిలో 'దీప్తి' కేసు కూడా ఒకటి. అయితే రాజీవ్ తో చేరి తన కొడుకు 'ఫిలిప్' కూడా చెడిపోతున్నాడనే ఒక ఆందోళన ఆంటోనికి ఉంటుంది. ఈ విషయంలో అతను ఫిలిప్ ను ఎంతగా మందలించినా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే ఆ తరువాత ఓ నిర్జన ప్రదేశంలో శామ్యూల్ కూతురు డెడ్ బాడీ దొరుకుతుంది. దీప్తి కేసు విషయంలో తన కూతురు సీఐ ఆంటోనికి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం అప్పుడే శామ్యూల్ కి అర్థమవుతుంది. తన కూతురు చనిపోవడం వెనుక ఆంటోని హస్తం ఉండొచ్చని శామ్యుల్ అనుకుంటాడు. అప్పుడు శామ్యూల్ ఏం చేస్తాడు? అసలైన నేరస్థులు ఎవరనేది కనిపెడతాడా లేదా అనేది మిగతా కథ.  

విశ్లేషణ : 

క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ కథ స్క్రీన్ ప్లే బాగుంది. అయితే దృశ్యం సినిమా చూసిన వారికి ఇది కాపీ  అనిపిస్తుంది. కానీ అది వేరే ఇది వేరే. ఈ సినిమాలో శామ్యూల్ తన కూతురు దారుణంగా హత్య చేయబడిందని తెలుసుకునేంత వరకూ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఆ తరువాత నుంచి కథ రొటీన్ గా మారిపోతుంది. శామ్యూల్ తనకి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో అనే కుతూహలంతో ఉన్న ఆడియన్ కి రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. 

దానితో పాటు గతంలో అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారాలను తెరపైకి తీసుకురావడంతో మెయిన్ పాయింట్ గాడితప్పింది. అసలైన శామ్యూల్ హాస్పిటల్లో బెడ్ పై ఉంటాడు. ఆంటోని పోలీస్ స్టేషన్ కి పరిమితమవుతాడు. ఈ మధ్యలో మిగతా పోలీసుల హడావిడి తప్ప, ఆడియన్స్ ను కదిలించే సన్నివేశాలైతే కనిపించవు. అప్పటివరకూ ఆడియన్స్ కి పరిచయం లేని పాత్రల పేర్లు చెప్తూ ఆ కేసులను ఈ కేసుతో ముడిపెడుతూ అయోమయాన్ని కలిగించారు. ప్రథమార్ధంలో కొన్ని సీన్లు బాగున్నప్పటికి మధ్యలో సీన్లు మరీ చప్పగా సాగాయి. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.

దృశ్యం సినిమా చూసినవారికి ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈజీగా అర్థమవుతుంది. అది చూడనివారికి ఇది మంచి ఎంగేజింగ్ సినిమా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు స్లోగా సాగుతాయి.  అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సతీశ్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. విష్ణు శ్యామ్ మ్యూజిక్ ఒకే. వినాయక్ ఎడిటింగ్ నీట్ గా ఉంది.  

నటీనటుల పనితీరు:

జోజూ జార్జ్ - బిజూ మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో వీరిద్దరి పర్ఫామెన్స్ ది బెస్ట్ అనే చెప్పాలి. మిగతా వాళ్ళు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా: క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ  'వలతు వశతే కన్నన్' నచ్చేస్తుంది.  వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్ : 2.25/ 5

✍️. దాసరి మల్లేష్






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.