Home  »  News  »  Nani: నాని ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ అగ్ర హీరో ప్రాజెక్ట్ నే కారణమా!

Updated : May 7, 2026


నాచురల్ స్టార్ నాని(Nani)ఓజి సుజీత్(Sujeeth)కాంబోలో  'బ్లడీ రోమియో'(Bloody Romeo)అనే ప్రాజెక్ట్ అధికారకంగా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. వాళ్ళ అంచనాలు అక్షర సత్యమనేలా మూవీ ప్రకటన రోజు వచ్చిన పోస్టర్ నిలిచింది. దీంతో త్వరగా ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసుకొని తమ ముందుకు రావాలని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.


 కానీ బ్లడీ రోమియోకి సంబంధించిన కీలక అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది. అనుకోని కొన్ని   కారణాల వల్ల  షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుజీత్ తన పూర్తి సమయాన్ని 'OG' సిక్వెల్ పై కేటాయించడమేనని తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు  వేగవంతంగా జరుగుతున్న్నాయని టాక్. 'OG'వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని పూర్తి చేయడం సుజీత్‌కి అత్యంత కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ మధ్య  షూటింగ్‌ని సకాలంలో పూర్తి చేయాలనే ఒత్తిడి ఉండటంతో బ్లడీ రోమియోని  తాత్కాలికంగా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. పూర్తిగా 'OG' సిక్వెల్ పైకి మళ్లించడం వెనుక ఒక బలమైన ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. మొదటి భాగం విడుదల కాకముందే రెండో భాగంపై కసరత్తులు మొదలుపెట్టడం సినిమా స్కేల్‌ని సూచిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సుజీత్ మేకింగ్ స్టైల్ పై నమ్మకంతో ఉన్నారు. 


Also read: janu lyri: యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్..  మిలియన్ల వ్యూస్‌తో సెన్సేషన్


'బ్లడీ రోమియో' వాయిదా పడటం నాని అభిమానులకి  కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ ఎప్పుడు వచ్చినా 'బ్లడీ రోమియో' బంపర్ ప్రాజెక్ట్ గా నిలవడంతో పాటు సూపర్ హిట్ అవ్వడం ఖాయం. నాని ప్రెజెంట్ ది పారడైజ్ తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 21 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. 

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.