Home  »  News  »  janu lyri: యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్..  మిలియన్ల వ్యూస్‌తో సెన్సేషన్

Updated : May 7, 2026

 


ప్రకృతి ఉన్నంత కాలం పల్లె పాట తన జోరు కొనసాగిస్తూ ఉంటుంది. అందులోను జానపద గీతాలు అంటే ఇంక చెప్పక్కర్లేదు. పసి పిల్లలు సైతం తమ ఆకలి సంగతి మర్చిపోయి సదరు జానపద గీతాన్ని హమ్ చేస్తూ డాన్స్ లు వేస్తుంటారు. అంతటి శక్తీ జానపద గీతాల సొంతం. ఈ విషయాన్నీ మరో సారి చాటి చెప్పిన సాంగ్ 'ఓ వెన్నెల'(Oh Vennela).యూ ట్యూబ్ లో రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధిస్తుంది. మరి జర గా ముచ్చటేందో  చూసేద్దాం.

ప్రముఖ జానపద గాయని జాను ల్యురి(janu lyri)పాడుతున్న పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ సెన్సేషన్లుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే  'ఓ వెన్నెల' సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఒక జంట మధ్య సాగే అందమైన ప్రేమ కావ్యంలా సాగుతుంది. “గాజులు గమ్మత్తుగా ఉంటాయి.. చీరకు చీరంచు రైకలు ఉన్నాయి” అంటూ కథానాయిక అందాన్ని, ఆమె పట్ల తనకున్న ప్రేమని కథానాయకుడు వర్ణించే తీరు సూపర్.

జాను ల్యురి తనదైన శైలిలో, గొంతులో ఉన్న సహజత్వంతో  ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగగా ప్రేమికుల మధ్య జరిగే సంభాషణ, ఎమోషన్స్‌  అద్భుతంగా పలికించారు. సంగీతం చాలా క్యాచీగా ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా  విపరీతంగా యూజ్ చేస్తున్నారు. సాంగ్  వీడియో క్వాలిటీ లొకేషన్లు పల్లెటూరి అందాలని కళ్లకి  కట్టినట్టు చూపుతున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి చేరువ కావడానికి ఈ విజువల్స్ కూడా ఒక కారణం.


Also read: Shah Rukh khan: నెట్టింట్లో షారుక్ ఖాన్ రొమాంటిక్ వీడియో వైరల్ 


విడుదలైన కొన్ని రోజుల్లోనే ట్రెండింగ్ లిస్టులో చేరింది. ఒకప్పుడు కేవలం పల్లెలకే పరిమితమైన ఫోక్ సాంగ్స్, నేడు గ్లోబల్ లెవల్‌లో వినబడుతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ వంటి వారు ఈ బాటలోనే పాపులర్ అవ్వగా, ఇప్పుడు జాను ల్యురి కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె పాటల్లో ఉండే ఎనర్జీ మరియు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉండే పదజాలం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 'ఓ వెన్నెల' పాటతో ఆమె తన ఫాలోయింగ్‌ని మరింత పెంచుకున్నారు. మండే ఎండలు సైతం మిమల్ని చూసి అసూయపడాలంటే  వెంటనే  ఓ వెన్నెల సాంగ్ చూసెయ్యండి. ఎండలైతే ఏంటంట అని   డాన్స్ చెయ్యడం పక్కా.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.