Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు అదిరిపోయే న్యూస్  

Updated : May 2, 2026

 

సమ్మర్ తన ప్రతాపాన్ని ఎంతగా  చూపిస్తున్నా సరికొత్త తాజా సినీ న్యూస్ సమ్మర్ సెగని సినీ ప్రియులకి కలగకుండా చేస్తున్నాయి.  మరి ఈ రోజు ఉన్న సినీ న్యూస్ ఏంటో చూద్దాం 

1 . బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు..వైరల్ గా మారిన పిక్స్ 

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ గా కూడా మారాయి. దీంతో అక్కడ్నుంచి రాగానే వారణాసి షూట్ ని స్టార్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ మహేష్ వెళ్ళింది జర్మనీలో ఎంజాయ్ చేయడానికి కాదు. అక్కడున్న అడవుల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి. ఈ విషయం మహేష్ రీసెంట్ గా చేసిన పోస్ట్ లతో అర్ధమవుతుంది.ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటు వారణాసి కోసం సిద్దమవుతున్నట్టుగా క్యాప్షన్ ఉంచాడు. ట్రెక్కింగ్ పిక్స్ వైరల్ గా మారాయి.

2 . రవిబాబు వర్సస్ 'పెద్ది' 
 'పెద్ది'  రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.  కానీ పలు డేట్స్ నుంచి వాయిదా పడటం తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు రవిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్ద సినిమాలు రాకపోయినా, రావని చెప్పకుండా మిగతా సినిమాలని  భయపెడుతూ థియేటర్లని ఖాళీగా ఉంచుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పెద్ది వర్సస్ రవిబాబుగా మారిపోయింది. జూన్ 4 న పెద్ది బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

3 .సోషల్ మీడియాలో అఖిల్ అభిమానుల సందడి 

లెనిన్ జూన్ 26 న థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది. పెద్ది జూన్ 25 న వస్తుందని అనుకున్నా జూన్ 4 కి వెళ్లిపోయింది. దీంతో అఖిల్ ఎలాంటి పోటీ లేకుండా సోలో గా ఉంటాడని,  పాజిటివ్ టాక్ వస్తే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయమని ఫ్యాన్స్  హంగామా చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హయ్యెస్ట్ మూవీ కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ 

4 .అంతకు వెయ్యి రెట్లు బాధ అనుభవించాలి.. నా మద్దతు ఆ పార్టీకే అంటున్న రష్మీ 
 
తిరుపతిలో వైసీపి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్లబండిపై ఆటోను ఉంచి ఎద్దులతో లాగించడంపై యాంకర్ నటి  రష్మీ స్పందిస్తు ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలనే వ్యాఖ్యలు చేసింది. దీంతో కొంత మంది వైసీపి నాయకులు రష్మీని వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వీటిపై కూడా రష్మీ స్పందిస్తు అవమానాలు నాకేం కొత్త కాదు. జంతువులపై జరిగే హింస విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ఇస్తానని తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

5 . తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్ రాబట్టిన జెట్లీ, గాయపడిన సింహం 

నిన్న వరల్డ్ వైడ్ గా జెట్లీ, గాయపడ్డ సింహం చిత్రాలు రిలీజయ్యాయి. జెట్లీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా  1 .5 కోట్ల  గ్రాస్ ని సాధించగా ,గాయపడ్డ సింహం  కోటి రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. మంచి అంచనాలతో వచ్చిన ఈ రెండు చిత్రాలు తొలి రోజు తక్కువ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టడం పలువుర్ని ఆశ్చర్యపరుస్తుంది. మేకర్స్ మాత్రం కలెక్షన్స్ వివరాలని అధికారకంగా వెల్లడి చెయ్యలేదు.

6 .దయచేసి టాక్సిక్ లో నా రొమాన్స్ సీన్స్ కట్ చేయండంటున్న కియారా అద్వానీ 

స్టార్ హీరోయిన్ కియారా టాక్సిక్ లో యష్ తో జత కట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా కియారా టాక్సిక్ ఫైనల్ కట్ చూసిందట. దీంతో తనపై యష్ పై చిత్రీకరించిన బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని తిలగించమని దర్శకురాలు గీతూమోహన్ దాస్ ని రీక్వెస్ట్ చేసిందనే మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సదరు సీన్స్ శృతి మించి ఉండటమే అందుకు కారణమని తెలుస్తుంది.

7. ఆస్కార్స్ కొత్త రూల్స్: ఏఐ కంటెంట్‌పై బ్యాన్

సినిమాల్లో పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్కార్స్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏఐ కంటెంట్‌పై బ్యాన్ విధించడంతో పాటు, ఒకే దేశం నుంచి పలు సినిమాలు పోటీలో ఉండే అవకాశం కల్పించారు. అలాగే ఒకే నటుడు ఒకేసారి అనేక సినిమాలకు నామినేట్ కావచ్చని తెలిపారు. ఈ మార్పులు 2027లో జరిగే 99వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమల్లోకి రానున్నాయి.


8 . విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్‌లోకి కృతి సనన్ 

విజయ్ దేవరకొండ ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న రణబలి, రౌడీ జనార్ధన తర్వాత హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో విజయ్ సరసన  కృతి సనన్ చేయబోతోందనే న్యూస్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే క్రేజీ కాంబో అని చెప్పవచ్చు. మరి ఈ విషయంపై  అధికారిక ప్రకటన వస్తుందేమో   చూడాలి.

9 .నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ 

కొత్త పెళ్లి కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ మంచి ఫన్ గా మారింది. తన శ్రీమతి కావ్యరెడ్డిని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ మంచి ఫన్ ని జెనరేట్ చేసాడు. అయితే ఈ పర్టిక్యులర్ లైన్ ఎందుకు పెట్టాడో అనేది చాలామందికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది. తాను నటించిన జయ జానకి నాయక మూవీలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ,శ్రీనివాస్ పై ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సదరు సీన్ లోని  నీ కూతురు నిప్పురా అనే డైలాగ్ ఉన్న విషయం తెలిసిందే.

10 . త్రివిక్రమ్, వెంకీ తో చేతులు కలిపిన థమన్ 

విక్టరీ వెంకటేష్,త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం యొక్క సంగీత బాధ్యతల  నుంచి యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో థమన్ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపాడు.
     

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.