![]() |
![]() |

వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), నవీన్ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ హారర్–యాక్షన్ థ్రిల్లర్ మే 22న థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన కృష్ణసాయి బర్త్ డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. "వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, నవీన్ చంద్ర చంద్ర గారి క్రేజీ కాంబినేషన్ అందరిని ఆకట్టుకుంటుంది. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. మే 22న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం." అన్నారు.

విభిన్నమైన కథా నేపథ్యం, బలమైన నటీనటుల సమాహారం, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
![]() |
![]() |