Home  »  News  »  Lavanya Tripathi: రామ్ చరణ్ బావకి థాంక్స్.. లావణ్య త్రిపాఠి క్యూట్ స్పీచ్!

Updated : May 2, 2026

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.  

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. "సతీ లీలావతి కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి" అని అన్నారు.

దేవ్ మోహన్ మాట్లాడుతూ .. "తెలుగు ఆడియెన్స్ ముందుకు మళ్లీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ మూవీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

తాతినేని సత్య మాట్లాడుతూ .. "మా సతీ లీలావతి ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి, నా డైరెక్షన్ టీంలోని వేణు గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారికి థాంక్స్. మే 8న మా చిత్రం రాబోతోంది. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నాగ మోహన్ మాట్లాడుతూ.. "సతీ లీలావతి చిత్రం మే 8న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. లావణ్య మేడంకి, దేవ్ సర్‌కి థాంక్స్. వారిద్దరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే సినిమాను ఇక్కడి వరకు తీసుకు రాగలిగాం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అన్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.