![]() |
![]() |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో రాబోతున్న 'డ్రాగన్'(Dragon)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యమవుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై 'మైత్రీ మూవీ మేకర్స్'కి చెందిన శశి స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఆ ప్రభావం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై పడినట్లు తెలుస్తోంది. 'వార్ 2' రిజల్ట్ ను దృష్టిలో ఉంచుకుని, డ్రాగన్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది.
మైత్రీ శశి తెలిపిన వివరాల ప్రకారం.. వార్ 2 ఫలితాన్ని విశ్లేషించుకున్న తర్వాత, ప్రశాంత్ నీల్ తన కథలోని కొన్ని కీలకమైన అంశాలను మరింత మెరుగుపరిచారు. సినిమాను వెంటనే ప్రారంభించకుండా, స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేయడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నారు. స్క్రిప్ట్ అనుకున్న దానికంటే గొప్పగా వచ్చింది. ఇప్పుడు షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
గతంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్', 'సలార్' వంటి సినిమాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ను అంతకు మించిన పవర్ఫుల్ రోల్లో చూపించేందుకు నీల్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సినిమా ఆలస్యమైనా సరే, అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. 'వార్ 2' ఎఫెక్ట్ వల్ల జరిగిన ఈ ఆలస్యం, 'డ్రాగన్' సినిమాకు ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
'డ్రాగన్' మూవీ 2027, జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ మే 20న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.
![]() |
![]() |