![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. (NBK x Koratala Siva)
బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత బాలయ్య నుంచి రానున్న సినిమా ఇదే. 'NBK112' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా, టాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
పవర్ ఫుల్ కాంబినేషన్ - పక్కా మాస్ మెసేజ్
కొరటాల శివ అంటేనే సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఒక పవర్ఫుల్ కథను కొరటాల సిద్ధం చేసినట్లు సమాచారం. బాలయ్య కుమార్తె తేజస్విని చొరవతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని, కథ విన్న వెంటనే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎస్ఎల్వీ సినిమాస్ (SLV Cinemas), యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌తో కూడిన హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 'NBK111'తో పాటు పారలల్ గా ఈ మూవీ షూటింగ్ పాల్గొననున్నారు బాలయ్య.
"Power Meets Purpose" అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉంది. బాలయ్య గర్జన, కొరటాల రచన తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
https://x.com/Theteluguone/status/2050084915937706143
![]() |
![]() |