Home  »  News  »  Pooja hegde: పెళ్లి పీటలు ఎక్కబోతున్న పూజాహెగ్డే!..పెళ్లి కొడుకు ఈ హీరోనే!

Updated : Apr 30, 2026

 

పూజాహెగ్డే పెళ్లి పీటలు ఎక్కబోతుందా!
ఆ హీరోనే వరుడా!
వైరల్ గా మారిన పిక్ 

 సెల్యులాయిడ్ పై బుట్టబొమ్మ 'పూజాహెగ్డే'(Pooja Hegde)జోరు ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా పర్సనల్ పిక్ ఇప్పుడు నయా జోష్ ని తెప్పిస్తుంది. జోష్ ని తెప్పించడమే కాదు బుట్టబొమ్మ బాయ్ ఫ్రెండ్ కన్ఫార్మ్ గా  అతనే అని త్వరలోనే ఆ ఇద్దరు పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయమని కూడా అంటున్నారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


రీసెంట్ గా ముంబై(Mumbai)లోని ఒక రెస్టారంట్ నుంచి బయటకి వచ్చిన పూజా ఒక కారులో వెళ్ళింది. కారులో తనతో పాటు రోహన్ మెహ్రా(Rohan Mehra)కూడా ఉన్నాడు. రోహన్  మెహ్రా ఎవరో కాదు బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత వినోద్ మెహ్రా కుమారుడు. తను కూడా నటుడే. నిజానికి ఈ ఇద్దరు సీరియస్ గానే  రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే రూమర్స్ ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఆ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, ఒకరి గురించి ఒకరు చేసుకొనే సోషల్ మీడియా పోస్టులు ఆ రూమర్లకి మరింత బలాన్ని ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఒకే కారులో వెళ్లడంతో రూమర్స్ కాస్తా వీక్ అయ్యే పరిస్థితి.  సోషల్ మీడియాలో సదరు పిక్ వైరల్ గా మారడంతో నెటిజన్స్ బుట్టబొమ్మ త్వరలోనే రోహన్ మెహ్రా తో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఫ్రెండ్స్ ఒకే కారులో వెళ్లకుందనే రూల్ ఏమైనా ఉందా అనే కామెంట్స్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఏది నిజమో కాలమే ఆన్సర్ ఇస్తుంది.  


Also read: VIjay: ఓటిటిలోకి విజయ్ పొలిటికల్ సెటైర్ మూవీ వచ్చేసింది భయ్యా.. ఫ్యాన్స్ షాక్ 

పూజా హెగ్డే అప్ కమింగ్ సినీ కెరీర్ కి వస్తే వరుణ్ ధావన్‌తో చేసిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'రిలీజ్ కి సిద్ధంగా ఉంది. జూన్ 5న రిలీజ్ డేట్. విజయ్ 'జన నాయగన్' లో కూడా చేసిన విషయం తెలిసిందే.  దుల్కర్‌ సల్మాన్ తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ లో కన్ఫర్మ్ అయ్యే  ఛాన్సు ఉంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.