Home  »  News  »  Jyothi Purvaj: ఎంత పని చేసావు.. స్లీపింగ్ టాబ్లెట్స్  మింగినా నిద్రరావడం లేదంట!

Updated : Apr 27, 2026

 

పెట్రోల్, డీజిల్ కొరతతో దేశం అల్లాడుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నా కూడా జ్యోతి పూర్వాజ్(Jyoti Purvaj)అభిమానులు మాత్రం అయితే ఏంటంట అని నింపాదిగా అంటుంటారు. వాళ్ళు సరిగా విన్నారో లేదో అని మళ్ళీ పెట్రోల్, డీజిల్ కొరత విషయం గుర్తు చేసినా అదే బావజాలంతో 'సో వాట్' అంటారు. అప్పుడు గాని జ్యోతి పూర్వాజ్ కొత్త పిక్స్  బయటకి వచ్చాయనే విషయం మనకి అర్ధం కాదు. ఆమె పిక్స్ అంతకి చరిష్మా ఉంది. నెట్టింటినే తన పుట్టినిల్లు, మెట్టినిల్లుగా భావించే  జ్యోతి రీసెంట్ గా కొన్ని పిక్స్ ని షేర్ చేసింది. దీంతో సదరు పిక్స్ చూసిన ఫ్యాన్స్ కి  స్లీపింగ్ టాబ్లెట్స్ మింగినా  నిద్ర రాని పరిస్థితి. ఆ డీటెయిల్స్ చూద్దాం.


తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో తన కర్వీ ఫిగర్‌ ని ప్రదర్శిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. వెస్ట్రన్ డ్రెస్సుల నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు ప్రతి లుక్‌లోనూ ఆమె ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. జ్యోతి షేర్ చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్‌ని  చూసి అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే నీదే జ్యోతి", "నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, తన ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆమె చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త లుక్‌తో ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

also read: Soundarya: కెమెరా ముందుకి సౌందర్య వారసురాలు 

జ్యోతి పూర్వాజ్ తన కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె ఒక గ్లామరస్ డాల్‌లా మారిపోయింది. కఠినమైన వర్కౌట్లు, క్రమశిక్షణతో కూడిన డైట్ పాటించి ఆమె ఈ స్థాయి ఫిట్‌నెస్‌ను సాధించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ట్రెండింగ్‌లో ఉండటంతో, రానున్న రోజుల్లో జ్యోతి నుంచి మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ ఆశించవచ్చు. గుప్పెడంత మనసులో జగతిగా జ్యోతి పూర్వాజ్ సృష్టించిన సంచలనం నడుస్తున్న జ్యోతి హవాకి సజీవ సాక్ష్యం.

  
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.