![]() |
![]() |

అంజలి అంజలి మెరిసే నవ్వుల పువ్వుల జాబిలీ అనే సాంగ్ లోని పదాలు ఎంత ముద్దుగా ఆకర్షణీయంగా ఉంటాయో, అంతే ముద్దుగా, ఆకర్షణీయంగా ఉండే నటీమణి నందినీ రాయ్(Nandini Roy). అచ్చ తెలుగు ముద్దుగుమ్మ అయిన నందిని మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నిలిచింది. హార్మోన్స్, మాయ, మోసగాళ్లకి మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఇతర బాషా చిత్రాల్లో కూడా చేసింది. రీసెంట్ గా ఈ ముద్దగుమ్మ మరణం లేని లెజండ్రీ నటితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం
ఆమె మాట్లాడుతు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, నా కెరీర్ చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యింది. ఒక ప్రముఖ కమర్షియల్ యాడ్ షూటింగ్ సమయంలో సౌందర్య కూతురిగా చేసే అవకాశం దక్కింది. అప్పుడు నాకు చాలా తక్కువ వయస్సు. కానీ ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. సౌందర్య గారితో కలిసి కెమెరా ముందుకు రావడం నా అదృష్టం. ఒక రకంగా కెమెరా ముందుకి సౌందర్య గారి వారసురాలిలా వచ్చాను. సౌందర్య గారు ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, సెట్లో అందరితో చాలా సరదాగా ఉండేవారు. ఆమె నిజంగా నన్ను తన కూతురిలాగే చూసుకున్నారు. నాకు చాక్లెట్లు ఇవ్వడం, నాతో ఆడుకోవడం వంటివి చేసేవారు. అంతటి గొప్ప నటి పక్కన కూర్చునే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. ఆమె నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను అని నందినీ భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా సౌందర్య గారితో కలిసి చేసిన ప్రకటనకి సంబంధించిన కొన్ని పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also read: Ntr: ఎన్టీఆర్ పై భానుచందర్ కీలక వ్యాఖ్యలు
నందినీ రాయ్ షేర్ చేసిన ఆ ఫోటోల్లో చిన్నారిగా నందినీ చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. పక్కనే సౌందర్య గారు నిండుగా, ఎంతో అందంగా కనిపిస్తున్నారు. సదరు పిక్స్ చూసిన నెటిజన్లు "సౌందర్య గారి లాంటి నటించడం మీ అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సౌందర్య గారు మరణించారని మరణం చెప్తుందేమో గాని పంచభూతాలు మాత్రం ఆ విషయాన్నీ అధికారకంగా వెల్లడి చేయడానికి దైర్యం చెయ్యడం లేదు. ఎందుకంటే సినిమా అనే పంచభూతాన్ని దాటి ఐదు పంచభూతాలు ముందుకు అడుగువెయ్యలేవు.
![]() |
![]() |