![]() |
![]() |

ఇక్కడుంది ఎవరనుకున్నారు సినిమా.. అందులోను తెలుగు సినిమా.. అసలు నా గురించి ఆలోచించకుండా తెలుగు ప్రేక్షకుడు నిద్ర పోవడం అనేది జరగని పని. మరి ఈ రోజు టాలీవుడ్ లో ఏ టాప్ న్యూస్ ని ఉంచిందో చూద్దాం.
1 . పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' రిలీజ్ డేట్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కొత్త విడుదల తేదీ లాక్ అయినట్లు సమాచారం. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన 'పెద్ది' ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇటీవల జూన్ కి వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, రిలీజ్ డేట్ ని రివీల్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' చిత్రాన్ని జూన్ 25, గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం
నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
2 . తెలుగు నాట అడుగుపెట్టిన వాలా 2 .. పాజిటివ్ రెస్పాన్స్
మలయాళంలో 200 కోట్లు వసూలు చేసిన బ్లాక్ బస్టర్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వాలా 2' బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ నేడు తెలుగులో విడుదలైంది. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే సబ్జెట్ తో రూపొందగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినపడుతుంది. మరి తెలుగులో ఎంత మేర కలెక్షన్స్ వసులు చేస్తుందో చూడాలి.
3 .థియేటర్స్ లో తిష్ట వేసిన గెదెలరాజు
సింగర్ గా తెలుగు ప్రేక్షకుల సుపరిచియస్తుడిగా మారిన రఘు కుంచే ఈ రోజు గెదెలరాజు - కాకినాడ తాలూకా తో థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకోగా మౌత్ టాక్ పాజిటివ్ గానే ఉంది. చివరి ఇరవై నిముషాలు ఒక రేంజ్ లో ఉందనే అభిప్రాయాన్ని కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు కాకినాడ రాజకీయాల నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామాగా రూపొందింది.
4. డార్లింగ్ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన 'డార్లింగ్'. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదల కాగా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి నిరూపించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 7.59 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని తెలుపుతూ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు.
5 . నితిన్ కి లైఫ్ ఇవ్వబోతున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్
నితిన్ ని కొంత కాలం నుంచి వరుస పరాజయాలు బిత్తర పోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు నితిన్ కి ఉపశమనం కలిగించడానికి హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి దిగింది. సోము, నర్రి అనే ఇద్దరు నితిన్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఆ ఇద్దరికి ఇదే ఫస్ట్ మూవీ. నెక్స్ట్ మంత్ మే 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లి రెండు నెలలలోనే షూట్ ని కంప్లీట్ చెయ్యబోతునట్టుగా తెలుస్తుంది.
6 . చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరకీ ఆమెనే విలన్ నా!
కొన్ని రోజులుగా ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయతి సినీ సర్కిల్స్, సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. చిరంజీవి, బాబీ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు బాలకృష్ణ, గోపిచంద్ మలినేని మూవీలో కూడా నెగిటివ్ రోల్ లో కనిపించనుందనే టాక్ మొదలయ్యింది. కొన్ని రోజులు ఆగితే గాని ఈ విషయంలో పూర్తి క్లారిటీ రాదు.
7 . ది కేరళ స్టోరీ 2 ఓటిటి డేట్ వచ్చేసింది
సంచనాలకి కేంద్ర బిందువుగా నిలిచిన ది కేరళ స్టోరీ 2 ఓటిటి రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారయ్యింది. జీ 5 వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ 5 అధికారకంగా ప్రకటించడమే కాకుండా తెలుగు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతు అసలైన పాన్ ఇండియా మజాని ఇవ్వబోతుంది.
8 . విశ్వంభర అప్ డేట్ ఎందుకు ఇవ్వడం లేదు
ఇప్పుడు మెగా అభిమానుల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. విశ్వంభర పై మేకర్స్ ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదని. దీంతో వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా విశ్వంభర అప్ డేట్ ఇవ్వాలని మేకర్స్, చిరంజీవికి విజప్తి చేస్తున్నారు. మరి స్పందిస్తారేమో చూడాలి.
9 .రావణుడిపై యష్ వ్యాఖ్యలు వైరల్
స్టార్ హీరో యష్ రామాయణలో రావణుడిగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు రావణుడు కేవలం ఒక విలన్ మాత్రమే కాదు. ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అత్యంత తెలివైనవాడు, గొప్ప పండితుడు మరియు వీరుడు. ఒక నటుడిగా నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం. రామాయణంలో రావణుడి పాత్రకు ఉన్న లోతు, అతని వ్యక్తిత్వంలోని విభిన్న షేడ్స్ నన్ను ఆకర్షించాయి. పైగా ఇలాంటి భారీ సినిమాల్లో ఇండియన్ సినిమాకి చెందిన ప్రతీ ముఖ్య నటుడూ నటించాల్సిన ఆవశ్యకత ఉంటుందని చెప్పుకొచ్చాడు.
10 .14 ఏళ్ల బాలికని చంపిన ప్రముఖ సింగర్
గత సెప్టెంబర్‌లో, 21 ఏళ్ల టిక్‌టాక్ స్టార్ డేవిడ్ పేరిట రిజిస్టర్ అయిన కారు టెక్సాస్ ఏరియాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచబడింది. ఆ కారు నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కబడిన మృతదేహం కనిపించింది. సదరు బాడీ 14 ఏళ్ల మైనర్ బాలిక సెలెస్టే రివాస్ హెర్నాండెజ్‌గా గుర్తించారు. మైనర్ బాలిక, తన మధ్య ఉన్న బంధం బయటపడుతుందని డేవిడ్ ఆ బాలికని చంపడం జరిగినట్టుగా విచారణలో బయటకొచ్చింది.
![]() |
![]() |