![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కొత్త విడుదల తేదీ లాక్ అయినట్లు సమాచారం.
మొదట మార్చి 27న విడుదల కావాల్సిన 'పెద్ది' ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇటీవల జూన్ కి వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, రిలీజ్ డేట్ ని రివీల్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' చిత్రాన్ని జూన్ 25, గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
రామ్ చరణ్ కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన చిత్రమని, ఆయన పాత్ర గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని తెలుస్తోంది.
వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
![]() |
![]() |