![]() |
![]() |

రాముడి గొప్ప తనాన్ని, భారతీయ సినిమా గొప్పతనాన్ని ఏక కాలంలో ప్రపంచ సినిమాకి తెలియచెయ్యడానికి సెట్స్ పై ఉన్న అద్భుత దృశ్య కావ్యం రామాయణ(Ramayana). రాముడిగా రణబీర్ (Ranbir Kapoor)చేస్తున్నాడనే పేరే కానీ సాక్షాత్తు ఆ శ్రీరాముడే చేస్తున్నట్టుగా ఉంది. అంతలా సెట్ అయ్యాడు. సీతమ్మ తల్లి క్యారక్టర్ విషయంలోను అంతే.. సాయి పల్లవి చేస్తున్నట్టుగా లేదు. సాక్షాత్తు సీతమ్మ తల్లినే చేస్తుందా అనిపిస్తుంది. రావణుడిగా చేస్తున్న యష్ నుంచి ఇంకా లుక్ అధికారకంగా లుక్ రివీల్ కాకపోయినప్పటికీ పైన మనం చెప్పుకున్న ఉదాహరణ లాగానే అభిమానులు భావిస్తున్నారు. రీసెంట్ గా రావణ క్యారక్టర్ కి సంబంధించి యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులని, ప్రేక్షకులని ఆకర్షిస్తున్నాయి. అవేంటో చూద్దాం
యష్(Yash)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు రావణుడు కేవలం ఒక విలన్ మాత్రమే కాదు. ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అత్యంత తెలివైనవాడు, గొప్ప పండితుడు మరియు వీరుడు. ఒక నటుడిగా నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే ఇష్టం. రామాయణంలో రావణుడి పాత్రకు ఉన్న లోతు, అతని వ్యక్తిత్వంలోని విభిన్న షేడ్స్ నన్ను ఆకర్షించాయి. అంతేకాకుండా, దర్శకుడు నితీష్ తివారీ రావణుడిని డిజైన్ చేసిన విధానం బాగా బాగా నచ్చింది. కేవలం ఒక నలుపు-తెలుపు క్యారక్టర్ లా కాకుండా, రావణుడిలోని మానవీయ కోణాలను కూడా ఇందులో చూపిస్తున్నారు. పైగా ఇలాంటి భారీ సినిమాల్లో ఇండియన్ సినిమాకి చెందిన ప్రతీ ముఖ్య నటుడూ నటించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అందుకే ప్రాజెక్ట్‌లో భాగం కూడా కావడానికి వెనుకాడలేదని ఆయన స్పష్టం చేశారు.
Also read: Ntr: ఎన్టీఆర్ హీరోయిన్ పదిహేను సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ
నమిత్ మల్హోత్రాతో కలిసి యష్ తన 'మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్' ద్వారా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రామాయణ తెరకెక్కుతుండగా దీపావళికి మొదటి భాగం రిలీజ్ కానుంది.

![]() |
![]() |