![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ క్రమంలో తన వివాహ వేడుకకు సినీ దిగ్గజాలను, సన్నిహితులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా, సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని పర్సనల్‌గా కలిసి పెళ్లి పత్రికను అందజేశారు.
సాయి శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ హాంపర్‌ను అందజేశారు. సాయి శ్రీనివాస్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చిరంజీవి, కాబోయే దంపతులకు తన ముందస్తు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. మెగాస్టార్‌తో బెల్లంకొండ ఫ్యామిలీ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఏప్రిల్ 29న కావ్య రెడ్డితో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.
https://x.com/Theteluguone/status/2046890657495880166
![]() |
![]() |