![]() |
![]() |

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తాజాగా 'వాలా 2' (Vaazha 2) మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని చిత్ర యూనిట్‌కు తన మద్దతు తెలిపారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ వేదికపై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. "తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలను, కొత్త టాలెంట్‌ను ఆదరిస్తారు. 'వాలా 2' సినిమాలో బ్రదర్స్ మధ్య ఉండే ఎమోషన్, ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అవుతుంది. మంచి ఎమోషనల్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా ఇక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని తెలిపారు. ఏప్రిల్ 24న విడుదల కానున్న ఈ సినిమా డెఫినెట్ గా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తన ప్రసంగం ముగిస్తూ గోపీచంద్ మలినేని ఎంతో ఎనర్జిటిక్‌గా "జై బాలయ్య" అని నినదించడంతో హాల్ అంతా కేరింతలతో దద్దరిల్లింది. నందమూరి అభిమానులకు ఈ నినాదం ఒక ఎమోషన్ అని, అది ఎక్కడ వినిపించినా పూనకాలు రావడం ఖాయమని మరోసారి నిరూపితమైంది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణతో 'NBK 111' చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఒక వైపు 'NBK 111'తో బిజీగా ఉన్న గోపీచంద్ మలినేని.. 'వాలా 2' ఈవెంట్‌లో పాల్గొనడం, 'జై బాలయ్య' అని నినదించడంతో ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
![]() |
![]() |